కంగనా రనౌత్ (kangana ) స్వీయ దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ (Emergency) కి తెలంగాణలో ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొని చిత్రాన్ని నిషేధించేందుకు ప్రయత్నిస్తానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సిక్కులకు హామీ ఇచ్చారు. సినిమాలో తమ వర్గాన్ని ఉగ్రవాదులు, దేశద్రోహులుగా చిత్రీకరించారని 18 మంది సభ్యుల సిక్కు బృందం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వద్ద ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ చిత్రంలో సిక్కులను తీవ్రవాదులుగా, దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని, ఇది “ఆక్షేపణీయమైనది” సమాజ ప్రతిష్టను దెబ్బతీసేలా చిత్రీకరణ ఉందని వారు ఆరోపించారు. తెలంగాణలో సినిమాను నిషేధించే అంశాన్ని పరిశీలించాలని హబ్బీర్ ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షబ్బీర్ అలీ.. సినిమా విడుదలపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఎమర్జెన్సీ సినిమా తీశారు కంగనా.. ఈ సినిమాకు ఆమెనే డైరెక్టర్ . ఇందిరాగాంధీ పాత్రను ఆమె పోషించారు. సెప్టెంబర్ 06 న ఈ చిత్రాన్ని పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ ను ఆపాలని చెప్పి గత కొద్దీ రోజులుగా సిక్కులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కంగనా మాత్రం తగ్గేదేలే అంటుంది. చెప్పిన టైంకు సినిమాను తీసుకొస్తామని అంటున్నారు. ఎమర్జెన్సీ సినిమా రిలీజ్‌కు పంజాబ్‌లో తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయరాదని ఆప్ ప్రభుత్వం కోరుతోంది. ఖలిస్తాన్ మద్దతుదారులు కూడా ఈ సినిమాకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ విడుదల చేశారు. సినిమాను విడుదల చేస్తే కంగనాను చంపేస్తామని ఖలిస్తాన్ వాదులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే బెదిరిపులకు భయపడే ప్రసక్తే లేదంటున్నారు కంగానా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తానని కౌంటర్ ఇచ్చారు. ఇంత జరుగుతున్నప్పటికి బాలీవుడ్ నుంచి తనకు మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also : Shani Pradosh Vrat 2024: శని నుంచి విముక్తి పొందడానికి ప్రత్యేకమైన ప్రదోష వ్రతం.. ఎప్పుడంటే..?