Kangana Ranaut: కాశీలో శివుడికి నిర్మాణం అవసరంలేదు…కంగనా కామెంట్స్..!!

వారణాసిలో జ్ఞానవాపి మసీదు నీటికుండంలో శివలింగం బయటపడటం పట్ల బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ స్పందించారు.

Published By: HashtagU Telugu Desk
Kangana

Kangana

వారణాసిలో జ్ఞానవాపి మసీదు నీటికుండంలో శివలింగం బయటపడటం పట్ల బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ స్పందించారు. కాశీలో ఏప్రాంతంలో చూసినా శివుడేనని ఆమె వ్యాఖ్యానించింది. శివుడు కాశీలోని అణువు అణువునా ఉన్నాడని…దానికి నిర్మాణం అవసరం లేదని పేర్కొంది. వివాదాస్పద వ్యాఖ్యలు, కంటెంట్ ద్రుష్ట్యా కంగానను ట్విట్టర్ నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె వ్యాఖ్యలను ANI వార్తా సంస్థ ట్విట్టర్ లో పోస్టు చేసింది.

కంగనా వ్యాఖ్యలు….

మధురలో ప్రతీ అణువులోనూ కృష్ణ పరమాత్ముడు ఉంటాడని…అయోధ్యలోని ప్రతి భాగంలోనూ రాముడు ఉంటాడు..ఆ విధంగానే కాశీలోని ప్రతి అణువులోనూ పరమేశ్వరుడు ఉంటాడు..ఆయనకు నిర్మాణం అవసరం లేదు..ప్రతి కణంలోనూ పరమేశ్వరుడు నివసిస్తుంటాడు అని కంగనా వ్యాఖ్యానించారు.

కాగా కంగనా ధాకడ్ అనే మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ ముందు మూవీ యూనిట్ బుధవారం కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుంది.ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు జ్ఞానవాపి మసీదుపై స్పందించాలంటూ కోరడంతో…ఈ వ్యాఖ్యలు చేశారు కంగనా.

  Last Updated: 19 May 2022, 02:49 PM IST