Site icon HashtagU Telugu

Kannappa: ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ.. పార్వతిగా కనిపించనున్న ఫైర్ బ్రాండ్.. ?

Mixcollage 22 Feb 2024 07 13 Am 2233

Mixcollage 22 Feb 2024 07 13 Am 2233

టాలీవుడ్ హీరో మంచు విష్ణు గురించి మనందరికీ తెలిసిందే. మంచువిష్ణు ప్రస్తుతం భక్త కన్నప్ప సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా భక్త కన్నప్ప సినిమా మంచు విష్ణు కలల ప్రాజెక్టు అన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టు నెలలో ఈ సినిమా శ్రీకాళహస్తిలో గ్రాండ్ గా ప్రారంభమైంది. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప పాత్రలో విష్ణు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ హిస్టారికల్ సోషియో ఫాంటసీ మూవీలో మధుబాల, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ వంటి భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

కాగా ఈ చిత్రంలో ప్రభాస్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నారంటూ వార్తలు జోరుగా వినిపించాయి. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఓ 10 నిమిషాల పాటు ఉంటుందట. ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నారు. ఇక ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నందుకు, రూపాయి కూడా తీసుకోవడం లేదని తెలుస్తోంది. మంచు ఫ్యామిలీతో స్నేహం కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే ఇందులో ప్రభాస్‌కు జోడిగా కంగనా రనౌత్ పార్వతి పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది.

దీనికి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ప్రభాస్, కంగనా ఏక్ నిరంజన్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక పాన్ ఇండియా స్థాయిలో భారీగా వస్తోన్న ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక అది అలా ఉంటే.. ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ మాత్రం అదిరిందనే చెప్పాలి. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version