బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్టయిలే వేరు. ఇండస్ట్రీలో ఇతర హీరోయిన్లదీ ఒకదారైతే.. కంగనాది మరో దారి అని చెప్పక తప్పదు. తన నటనతో ఆకట్టుకునే కంగనా హీరోలకు పోటీగా నిలిచి, వాళ్లతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటిల్లో కంగనా ఒకరు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గానూ పేరుంది. కంగనా సినిమాల ద్వారా ఎంత ఫేమ్ కూడగట్టుకుందో, పలువురిపై విమర్శలు చేస్తూ తన ప్రతిష్టతను దిగజార్చుకుంటోంది. రీసెంట్ గా జయలలిత కథ ఆధారంగా తీసిన ‘తలైవి’ మూవీలో నటించి, తానెంత విలువైన నటినో చాటి చెప్పింది. ఆమె నటకుగానూ ఇటీవల పద్మశ్రీ అవార్డు కూడా దక్కింది.
తాజాగా ఈ నటి ప్రేమ, పెళ్లి పై మొదటిసారి ఓపెన్ అయ్యింది. ‘మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు’ మీడియా ప్రశ్నించగా.. ‘‘నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుని పిల్లలను కనాలనుకుంటున్నాను. ఐదేళ్లలో నన్ను నేను తల్లిగా, భార్యగా, నవ భారత దార్శనికతలో చురుగ్గా పాల్గొంటున్న వ్యక్తిగా చూస్తున్నాను’ అని అన్నారు. తన జీవితంలో ప్రత్యేకంగా ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు, కంగనా “అవును” అని మర్యాదగా చెప్పింది. తన భాగస్వామి ఎవరు అని అడిగినప్పుడు, “అందరికీ త్వరలో తెలుస్తుంది” అని కంగనా బదులిచ్చింది.
కంగనా రనౌత్‌కు ఇటీవల భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పద్మశ్రీ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. “ఒక కళాకారిణిగా, నేను అనేక అవార్డులు, గౌరవాలు, ప్రేమ మరియు కృతజ్ఞతలు అందుకున్నాను. కానీ మొట్టమొదటిసారిగా, భారత ప్రభుత్వం నాకు అవార్డును అందించింది. అందుకు నేను రుణపడి ఉంటాను. చిన్న వయస్సులో నా కెరీర్ ప్రారంభించాను. పరిశ్రమలో అడుగుపెట్టిన 8-10 సంవత్సరాల తర్వాత మాత్రమే విజయం సాధించాను. నేను డబ్బు కంటే శత్రువులను ఎక్కువగా సంపాదించుకున్నాను’’ అని తన మనసులో మాట భయటపెట్టింది.