Site icon HashtagU Telugu

Kangana Caravan: కంగనా కార్వాన్ చాలా కాస్ట్ లీ.. బాలీవుడ్ లోనే ఖరీదైన ఇంటీరియర్

Kangana

Kangana

ఈ తరం హీరోయిన్స్ కు కార్వాన్ ఉండటమనేది చాలా సర్వసాధారణం. ఒక్కో స్టార్స్ కు ఒక్కో విధంగా కార్వాన్స్ ఉన్నాయి. అంతేకాదు.. వాళ్ల అభిరుచుల మేరకు అదిరిపొయే ఫీచర్స్, వసతులతో మోల్డ్ చేయబడి ఉంటుంది. టాలీవుడ్ లో అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్స్ కు లగ్జరీ కార్వాన్స్ ఉన్నాయి. ఇక బాలీవుడ్  స్టార్స్ కు లగ్జరీ కార్వాన్స్ ఉన్నాయి.

అయితే కేతన్ రావల్ బాలీవుడ్ నటుల కోసం ప్రత్యేకంగా క్యారవాన్‌లను డిజైన్స్ చేస్తుంటాడు. బాలీవుడ్ లో ఇతర స్టార్స్ తో పోల్చితే కంగనా రనౌత్ కార్వాన్ ఖరీదైన, విలాసవంతమైనదిగా ఉంటుంది. జస్ట్ కార్వాన్ ఇంటీరియర్ కోసమే కంగనా 65 లక్షలు ఖర్చు చేసిందట. వ్యాన్ లోని సోఫాలు, ఛెయిర్లు అన్నీ.. ఒరిజినల్ టేక్ వుడ్ తో తయారు చేశామని చెబుతున్నారు కేతన్.

కారవాన్ ఇంటీరియర్ కోసం ఇంత భారీ ధరను మరే ఇతర సెలబ్రిటీ లేదా నటుడు చెల్లించలేదు. బాలీవుడ్ ప్రముఖుల కోసం మాత్రమే కాకుండా అంబానీ కుటుంబ సభ్యుల కోసం కూడా కార్వాన్స్ డిజైన్ చేసిన కేతన్ రావల్, కంగనా కారవాన్‌లో అత్యంత ఖరీదైన ఇంటీరియర్ ఉందని పేర్కొన్నాడు. ఈ పరిశ్రమలో, స్టార్ హీరోలు మరియు హీరోయిన్‌లకు షూటింగ్ లొకేషన్‌ల కోసం ప్రత్యేకమైన కారవాన్‌లు అవసరం, వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా ఇంటీరియర్ డిజైన్ ఉంటుంది.

Exit mobile version