Site icon HashtagU Telugu

Kangana Ranaut: చంద్రముఖి2 నుంచి కంగనా ఫస్ట్ లుక్ రిలీజ్, డిఫరెంట్ గెటప్ లో బాలీవుడ్ క్వీన్

Kangana

Kangana

ఒక భాషలో హిట్ అయిన సినిమాలను, మళ్లీ అదే సినిమా పేరుతో స్వీక్వెల్ తీయడం ఇండస్ట్రీలో సహజంగా మారింది. గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖి (Chandramukhi) మూవీ సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీకి కొనసాగింపుగా లారెన్స్ హీరోగా చంద్రముఖి2 వస్తోంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హారర్ కామెడీ మూవీలో కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తుంది.

చిత్ర నిర్మాతలు నటి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. నటి కంగనా లుక్ అభిమానులను ఫిదా చేసింది.  కంగనాను ఆకుపచ్చ, బంగారు రంగు చీరలో ప్రదర్శించే పోస్టర్‌లో ఆకట్టుకుంది. చంద్రముఖి గా తాను చాలా అందంగా ఓ అద్దం ముందు నించుని తనని తాను చూసుకుంటున్న సింపుల్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. డిఫరెంట్ స్టైయిల్ కాస్టూమ్ తో అదరగొట్టింది. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి అయితే సంగీతం అందిస్తుండగా ఈ వినాయక చవితి కానుకగా పాన్ ఇండియా వైడ్ లైకా ప్రొడక్షన్స్ వారు గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ ఫేం కంగనా రనౌత్ నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

చంద్రముఖి 1 విషయానికి వస్తే.. 2005లో రజనీకాంత్ (Rajinikanth) హీరోగా జ్యోతిక మరో ప్రధాన పాత్రలో నటించింది. దాదాపుగా 18 ఏళ్ళ తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ వస్తోంది. చంద్రముఖి కి దర్శకత్వం వహించిన పి వాసునే(P Vasu) చంద్రముఖి సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ అప్డేట్స్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాయి.

Also Read: Cyber Criminals: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు, 3000 మందిపై కేసులు బుక్

Exit mobile version