Kangana On Brahmastra: ‘బ్రహ్మస్త్ర’పై కంగనా ఆగ్రహం.. చిత్రనిర్మాతలపై ఘాటు వ్యాఖ్యలు!

కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకెక్కింది. సున్నితమైన విషయాల్లో ఓపెన్ కామెంట్స్ చేయడానికి ఏమాత్రం వెనకడగు వేయదు.

Published By: HashtagU Telugu Desk
Brahmastra

Brahmastra

కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకెక్కింది. సున్నితమైన విషయాల్లో ఓపెన్ కామెంట్స్ చేయడానికి ఏమాత్రం వెనకడగు వేయదు. ఆమెకు కరణ్ జోహార్ పట్ల ద్వేషం ఉంది. బాలీవుడ్‌లో నెపోటిజం సంస్కృతి, కొన్ని కుటుంబాల ఆధిపత్యాన్ని విమర్శించారు. అయితే కరణ్ జోహార్ నిర్మించిన ‘బ్రహ్మాస్త్ర’ సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ మూవీ. రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా లేదని కొన్ని రివ్యూస్ తేల్చిచెప్పాయి.

కంగనా ఈ అవకాశాన్ని వాడుకుంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ, నిర్మాత కరణ్ జోహార్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. “@ayan_mukerjiని మేధావి అని పిలిచిన ప్రతి ఒక్కరినీ వెంటనే జైలులో పెట్టాలి. అతను ఈ చిత్రాన్ని తీయడానికి 12 సంవత్సరాలు తీసుకున్నాడు. ఈ 400 రోజులకు పైగా చిత్రీకరించాడు. 600 కోట్ల బూడిదలో పోశాడు’’ అంటూ మండిపడింది. “మీరు అబద్ధాన్ని విక్రయించడానికి ప్రయత్నించినప్పుడు ఇలానే జరుగతుంది. ఈ చిత్రానికి నిధులు సమకూర్చడానికి భారతదేశంలోని ఫాక్స్ స్టూడియో తనంతట తానుగా అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంకా ఎన్ని స్టూడియోలు మూసివేయాల్సి వస్తోందా?” అంటూ రియాక్ట్ అయ్యింది. ప్రస్తుతం కంగనా కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

  Last Updated: 10 Sep 2022, 02:36 PM IST