Site icon HashtagU Telugu

Kangana-Prabhas: ఫ్యాన్స్‌తో కంగనా చిట్‌ చాట్‌… ప్రభాస్‌ అద్భుతమైన హోస్ట్!

Kangana On Prabhas B 2002230817

Kangana On Prabhas B 2002230817

Kangana-Prabhas: కెరీర్‌లో నాలుగు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న నటి బాలీవుడ్ క్వీన్‌ కంగనా రనౌత్. ఈ భామ తెలుగులో చేసింది ఒక్క సినిమానే. అది కూడా అప్పటి యంగ్‌ రెబల్ స్టార్‌, ఇప్పటి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌‌తో నటించిన ఏక్‌ నిరంజన్‌. 2009 ఏడాదిలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద నెగిటివ్‌ టాక్‌నే తెచ్చుకుంది. ‌అయితే ప్రస్తుతం చంద్రముఖి-2 షూటింగ్‌తో బిజీగా ఉన్న కంగనా రనౌత్‌, ట్విటర్‌లో చిట్‌చాట్‌ చేసింది.

 

కంగనా రనౌత్‌ ఇటీవలే ట్విట్టర్‌లో చిట్‌చాట్‌ సెషన్‌లో పాల్గొంది. స్టార్ యాక్టర్ ప్రభాస్‌తో ఉన్న స్వీట్‌ మెమొరీని షేర్ చేసుకోవాలని కంగనాని ఓ ఫాలోవర్‌ చిట్‌చాట్‌ సెషన్‌లో అడిగారు. ప్రభాస్‌ ఇంట్లో ఎప్పటికీ బెస్ట్ ఫుడ్ ఉంటుందన్న కంగనా..‌. ప్రభాస్‌ అద్భుతమైన హోస్ట్‌ అని సమాధానమిచ్చింది. ఇక కంగనా పొగడ్తలతో ప్రభాస్‌ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

 

లారెన్స్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపిస్తోందని మరోకరు కంగనాని అడగ్గా.. లారెన్స్ అద్భుతమైన వ్యక్తి అని అన్నారు. హృతిక్ రోషన్, దిల్జీత్ దోసాంజ్ వీరిద్దరిలో మీ అభిమాన నటుడెవరని అడగ్గా.. ఒకరు యాక్షన్, మరొకరు వీడియో సాంగ్స్ చేస్తారని నేను అనుకుంటున్నా అని చెప్పంది. ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియాలో మీ ‘టీకూ వెడ్స్ షేరు’ ఎప్పు డు విడుదలవుతుందని అడగ్గా,నేను ముంబయి చేరుకోగానే అమెజాన్ ప్రైమ్ సంస్థతో దానికి గురించి చర్చిస్తా అని సమాధానం ఇచ్చింది.

 

రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడని ఓ ఫాలోవర్‌ అడిగారు కంగనాని. దాని గురించి కచ్చితంగా చెప్పలేనని.. ప్రస్తుతానికి నటిగా ఇంకా చాలా చేయాలనుకుంటున్నానంది. మరో ప్రశ్నకు టీనేజ్ నుంచి తాను యోగా, ధ్యానం చేస్తున్నా. మెడిటేషన్లో భాగమైన శూన్య, సంయమలాంటి వాటిని ఇషా ఫౌండేషన్ వారి సహకారంతో నేర్చుకుంటున్నాని వెల్లడించింది.