Kandula Durgesh : ఏపీలో చంద్రబాబు(Chandrababu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆధ్వర్యంలో ప్రభుత్వం దూసుకుపోతుంది. అన్ని శాఖల మంత్రులు పరుగులు పెడుతూ పనులు చేస్తున్నారు. ఇటీవల వరదలు వచ్చినప్పుడు మంత్రులంతా సమన్వయం చేసుకొని సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు. ప్రతి శాఖ మంత్రి తమ శాఖకు సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమాలు అన్ని చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో జనసేన ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రలో టూరిజం అభివృద్ధి గురించి, ఇటీవల వరదల వల్ల టూరిజం శాఖకు వచ్చిన నష్టం గురించి మాట్లాడారు. అలాగే సినిమా స్టూడియోల నిర్మాణం గురించి కూడా కామెంట్స్ చేసారు.
విలేఖరుల సమావేశంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 27వ తేదీన వరల్డ్ టూరిజం డే సందర్భంగా విజయవాడలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నాము. నాటక రంగంకు సంబంధించి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయనున్నాము. అలాగే రాష్ట్రంలో స్టూడియోలు నిర్మించడానికి నిర్మాతలు కానీ, సినీ ప్రముఖులు కానీ ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని సినీ నిర్మాతలకు లేఖ రాయనున్నాము. తెలుగు చలన చిత్ర పరిశ్రమ రాష్ట్రంలో అభివృద్ధి చెందేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాము అని తెలిపారు. మరి దీనిపై తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Also Read : Vikram : ఆ సినిమా మిస్ అయిందని రెండు నెలలు ఏడ్చాను.. విక్రమ్ కామెంట్స్..