Kamal R Khan : సినిమాలు ఫ్లాప్ అన్నందుకు నా మీద 10 కేసులు పెట్టారు.. నటుడు సంచలన ట్వీట్..

తాజాగా కమల్ ఖాన్ వేసిన మరో ట్వీట్ వైరల్ గా మారింది.

  • Written By:
  • Publish Date - April 17, 2024 / 04:30 PM IST

Kamal R Khan : బాలీవుడ్, భోజ్ పురి నటుడు, నిర్మాత కమల్ రషీద్ ఖాన్ తన సినిమాల కంటే కూడా తన ట్వీట్స్ తోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. నటీనటుల మధ్య అఫైర్ ఉందంటూ, సినిమాలు ఫ్లాప్ అంటూ ట్వీట్స్ వేస్తూ వైరల్ అయ్యాడు కమల్ ఖాన్. ఈ క్రమంలో అభిమానులు, సెలబ్రిటీల నుంచి విమర్శలు కూడా ఎదుర్కున్నాడు. అయినా కూడా కమల్ ఖాన్ మారలేదు. వచ్చిన ప్రతి సినిమా గురించి నెగిటివ్ గా రివ్యూలు ఇస్తూ, హీరో – హీరోయిన్స్ మధ్య అఫైర్స్ పెడుతూనే ఉన్నాడు.

తాజాగా కమల్ ఖాన్ వేసిన మరో ట్వీట్ వైరల్ గా మారింది. అది కూడా ఎలాన్ మస్క్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ వేయడం గమనార్హం. ఎలాన్ మాస్క్ ని ట్యాగ్ చేస్తూ.. మిస్టర్ ఎలాన్ మస్క్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అమెరికా, ఇంగ్లాండ్, యూరప్ లో మాత్రమే ఉంది, ఇండియాలో లేదు. నేను సినిమాలు ఫ్లాప్ అని చెప్పినందుకు నా మీద దాదాపు 10 కేసులు పెట్టారు. ఒకవేళ నేను నా ఫ్రెండ్ కి బర్త్ డే విషెష్ చెప్పినా పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు. కోర్టులు కూడా ఎలాంటి అడ్డు చెప్పవు అని ట్వీట్ చేసాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

అయితే కమల్ ఖాన్ ఈ ట్వీట్ ఇప్పుడు ఎందుకు వేసాడు, బర్త్ డే విషెష్ చెప్తే అరెస్ట్ చేస్తారా మరీ విడ్డురం కాకపోతే, వైరల్ అవ్వడానికి ఇలాంటి ట్వీట్ వేసాడు, మధ్యలో మస్క్ ని ఎందుకు లాగాడు.. అని మరోసారి నెటిజన్లు కమల్ ఖాన్ ని విమర్శిస్తున్నారు. మరి కమల్ ఖాన్ ఇప్పుడు ఈ ట్వీట్ ఎందుకు వేశాడో అతనికే తెలియాలి.

 

Also Read : Ananya Nagalla : రాముడి గుడి కట్టడం కోసం తాత పదేళ్ల పోరాటం.. హీరోయిన్‌తో గొడవ..