Site icon HashtagU Telugu

Kamal Uncle Srinivasan Died : కమల్ హాసన్ ఇంట విషాద ఛాయలు

Kamal Uncle Srinivasan Died

Kamal Uncle Srinivasan Died

లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. కమల్ హాసన్ మామయ్య, పీపుల్ జస్టిస్ సెంటర్ అధ్యక్ష్యుడు అరుయిర్ శ్రీనివాసన్ (92) (Uncle Srinivasan) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోవృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన… నిన్న సోమవారం తన స్వస్థలం అయిన కొడైకెనాల్ లో కన్నుమూసారు. మావయ్య మరణంపై కమల్ హాసన్ ఎమోషనల్ అవుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

” నా వ్యక్తిత్వాన్ని రూపుమాపడంలో ప్రధాన పాత్ర పోషించిన అంకుల్ అరుయిర్ శ్రీనివాసన్ కొడైకెనాల్‌లో కన్నుమూశారు. మామ వాసు తన విప్లవాత్మక ఆలోచనలు మరియు ధైర్య సాహసాల కోసం ఎంతో పోరాడారు.. బంధువులు మరియు స్నేహితుల మధ్య ఆయన వీరోచిత వ్యక్తి. అంత్యక్రియల నిమిత్తం ఆయన భౌతికకాయాన్ని ప్రజానీతి కేంద్రం కార్యాలయానికి తీసుకురానున్నారు. ఈరోజు (23-04-24) ఉదయం 10:30 గంటలకు బీసెంట్ నగర్ మిన్ మయన్‌లో దహన సంస్కారాలు జరుగుతాయని నేను మీకు తెలియజేస్తున్నాను” అని కమల్ తెలిపాడు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే కమల్ కూతురు శృతి హాసన్ శ్రీనివాసన్ మృతిపై ఎమోషనల్ అయ్యింది. ” మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను వాసు మామ.. నా చిన్ననాటి జ్ఞాపకాలన్నింటికీ ధన్యవాదాలు, కోడిలోని అడవుల్లో గంటల తరబడి నడవడం, జీవితం గురించి నాకు ప్రకృతి గురించి బోధించడం మరియు మీ అందమైన కథలతో నన్ను తీర్చిదిద్దడం, నా కోసం మీరు ఒక రకమైన నిజమైన తిరుగుబాటుదారుగా మారారు. స్వచ్ఛమైన బంగారు హృదయం కలిగిన మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తారు వాసు మామా” అంటూ రాసుకొచ్చింది. ఇక కమల్ సినిమాల విషయానికి వస్తే ..ప్రస్తుతం ‘కల్కి’, ‘థగ్‌ లైఫ్‌’, ‘ఇండియన్‌2’ సినిమాల షూటింగ్ లు చేస్తున్నారు.

Read Also : TDP : మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలో నంబర్ వన్‌గా మారుస్తా: లోకేశ్‌ రచ్చబండ కార్యక్రమం