Site icon HashtagU Telugu

Kamal Hassan : కమల్ పారితోషికం పెంచడంపై ఇంట్రెస్టింగ్ న్యూస్..!

Indian 2 What is Going On Shankar Kamal Hassan

Indian 2 What is Going On Shankar Kamal Hassan

Kamal Hassan లోకనాయకుడు కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ కు రెడీ అవుతుంది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఇండియన్ సినిమా అప్పట్లోనే సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. మళ్లీ పాతికేళ్ల తర్వాత ఇండియన్ 2 సినిమా చేస్తున్నారు. ఇండియన్ 2 మొదలు పెట్టి చాలా ఏళ్లు అవుతున్న సినిమా ఇన్నాళ్లకు పూర్తి చేశారు. రిలీజ్ ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. ఐతే ఇండియన్ 2 సినిమా రిలీజ్ టైం లో ఇండియన్ సినిమా అదే పాతికేళ్ల క్రితం ఆ సినిమా విషయాలను కూడా పంచుకున్నారు కమల్ హాసన్.

ఇండియన్ సినిమా కథ చెప్పడానికి వచ్చినప్పుడు తనకు ఆ సినిమాలో నటించడం ఇష్టం లేక.. సినిమాలో నెగిటివ్ రోల్ తను ఇంతకుముందే చేసినట్టుగా అనిపించి కాదనడం కుదరక పారితోషికం పేరు చెప్పి తప్పించుకుందామని అనుకున్నారట. తనకు అప్పటివరకు ఇచ్చే రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ అడిగితే ఎలాగు ఇవ్వనని చెప్పి వెళ్తారని అనుకున్నారట. కానీ కమల్ అడిగిన పారితోషికం ఇస్తానని చెప్పడంతో ఇండియన్ సినిమా చేశారట.

అలా ఇండియన్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఐతే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ సినిమా సీక్వెల్ చేయడంపై స్పందించిన కమల్ అప్పటికన్నా ఇప్పుడు అవినీతి ఎక్కువైందని ఈ సినిమా కచ్చితంగా ప్రజల్లో మార్పు తెస్తుంది.. ఆలోచించేలా చేస్తుందని అంటున్నారు. కమల్ లీడ్ రోల్ లో నటించిన ఇండియన్ 2 సినిమాలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

Also Read : Rukhmini Vasanth : రుక్మిణి టీచర్ అవ్వాలనుకుందా.. అలా జరగనందుకు హ్యాపీ అంటున్న ఆడియన్స్..!