Kamal Hassan : కమల్ హాసన్ సినిమా ఆగిపోయిందా.. కారణాలు ఏంటి..?

లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Hassan) చాలా కాలం తర్వాత విక్రం సినిమాతో సూపర్ హిట్ అందుకుని సూపర్ ఫాం లోకి వచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Kamal Hassan Crazy Project Shelved With Star Director

Kamal Hassan Crazy Project Shelved With Star Director

లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Hassan) చాలా కాలం తర్వాత విక్రం సినిమాతో సూపర్ హిట్ అందుకుని సూపర్ ఫాం లోకి వచ్చారు. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన విక్రం సినిమా కమల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత కెరీర్ లో కొత్త ఉత్సాహంతో పనిచేస్తున్న కమల్ హాసన్ కి అనూహ్యంగా మొదలైన సినిమా ఆగిపోయినట్టు తెలుస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

కమల్ హాసన్ ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్ లో థగ్ లైఫ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను భారీ బడ్జెట్ తో నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత హెచ్.వినోద్ డైరెక్షన్ లో ఒక సినిమా ప్లాన్ చేశారు. అయితే వినోద్ తో కలిసి కమల్ చేయాల్సిన సినిమా ఆగిపోయినట్టు తెలుస్తుంది. సినిమా ఆగిపోవడానికి కారణాలు ఏంటన్నది తెలియదు కానీ కమల్ సినిమా ఆగిపోయినట్టు కోలీవుడ్ వర్గాలు కన్ ఫర్మ్ చేశాయి. హెచ్. వినోద్ అజిత్ తో సినిమాలు చేశారు.

కమల్ తో సినిమా చేసి డైరెక్టర్ గా మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఓపెన్ చేయడం గ్రాండ్ గా జరిగింది. కానీ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కమల్ థగ్ లైఫ్, ఇండియన్ 2 సినిమాలు చేస్తున్నారు. విక్రం తో హిట్ అందుకున్న కమల్ ఇప్పుడు మళ్లీ ఒకప్పటి జోష్ తో సినిమాలు చేస్తున్నారు.

Also Read : Shobhitha Dhulipala : బాబోయ్ శోభితా సోషల్ మీడియాని హీటెక్కించేసింది.. తెలుగు అమ్మాయి టాప్ లేపే అందాలు..!

  Last Updated: 28 Jan 2024, 09:46 PM IST