Kamal Hassan : కమల్ కామెంట్స్ పై ఆలోచనలో పడ్డ రెబల్ స్టార్ ఫ్యాన్స్.. కల్కి ఏం జరుగుతుంది..?

Kamal Hassan ప్రభాస్ లీడ్ రోల్ లో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో 500 కోట్ల పైన బడ్జెట్ తో వస్తున్న సినిమా కల్కి 2898 ఏడి. ఈ సినిమా లో అమితాబ్ బచ్చన్, దిశా పటానితో పాటుగా దీపికా పదుకొనె

Published By: HashtagU Telugu Desk
Indian 2 What is Going On Shankar Kamal Hassan

Indian 2 What is Going On Shankar Kamal Hassan

Kamal Hassan ప్రభాస్ లీడ్ రోల్ లో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో 500 కోట్ల పైన బడ్జెట్ తో వస్తున్న సినిమా కల్కి 2898 ఏడి. ఈ సినిమా లో అమితాబ్ బచ్చన్, దిశా పటానితో పాటుగా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో లోక నాయకుడు కమల్ హాసన్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే.

అయితే సినిమాలో కమల్ హాసన్ విలన్ గా చేస్తున్నాడని అందరు అనుకున్నారు. కానీ రీసెంట్ గా కల్కి లో తను చేసే పాత్ర గురించి చెప్పి షాక్ ఇచ్చాడు కమల్ హాసన్.

ప్రభాస్ కల్కి లో తాను గెస్ట్ రోల్ చేస్తున్నానని సినిమా బాగా వస్తుందని అన్నారు కమల్ హాసన్. అంతేకాదు తన పోర్షన్ పూర్తి చేశానని సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. కల్కి సినిమాలో కమల్ హాసనే విలన్ అని ఇప్పటి దాకా అనుకున్న ఆడియన్స్ కు ఇది షాకింగ్ న్యూస్ అయ్యింది. ప్రభాస్ కమల్ ఢీ కొడతారన్న ప్రేక్షకుల అంచనాలు తప్పాయి.

కమల్ హాసన్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే కల్కిలో ఆయనది నెగిటివ్ రోల్ కాదని అర్ధమవుతుంది. మరోపక్క కల్కి సినిమాలో ప్రభాస్ పాత్ర కొనేళ్ల పాటు గుర్తుండిపోతుందని నిర్మాతల్లో ఒకరైన స్వప్న దత్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. మే 9న రిలీజ్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కల్కి సినిమా పై ఇప్పటికే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

Also Read : Kamal Hassan Thug Life : కమల్ థగ్ లైగ్ కి బిగ్ షాక్.. నిన్న దుల్కర్ నేడు అతను కూడా..?

  Last Updated: 25 Mar 2024, 11:19 AM IST