Site icon HashtagU Telugu

Nayagan Re Release: కమల్ నాయ‌గ‌న్ రీ-రిలీజ్

Naayagan Re Release

Naayagan Re Release

Nayagan Re Release: కమల్ హాసన్ ప్రధాన పాత్రలో మ‌ణిర‌త్నం నిర్మించిన చిత్రం నాయ‌గ‌న్. 1987లో విడుదలైన ఈ సినిమాపై ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఒక విధమైన ఆసక్తి ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఈ చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని 4కేలో 120 థియేటర్లలో ప్రదర్శించనున్నారు. కేరళ, కర్నాటకలో రీ-రిలీజ్ ఉన్నప్పటికీ, ఈ సినిమా తెలుగు వెర్షన్ గురించి మేకర్స్ వెల్లడించలేదు.

ముంబై అండర్ వరల్డ్ హీరో కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ హాసన్ వేలునాయక్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో తన నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు. కమల్ హాసన్ హీరోగా ఆస్కార్ అవార్డులకు భారత అధికారిక ఎంట్రీగా ఎంపికైంది.

కమల్ హాసన్ కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాలలో నాయగన్ ఒకటి. బాలకుమారన్‌తో కలిసి మణిరత్నం ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. శరణ్య, కార్తీక, ఢిల్లీ గణేష్ ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం సమకూర్చారు.

Also Read: Telangana: ఇథనాల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా నిరసనలు..హింసాత్మకం