Site icon HashtagU Telugu

Bigg Boss : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు ‘బిగ్ షాక్’

Kamal Bigboss

Kamal Bigboss

బిగ్ బాస్ (Bigg Boss) ..ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నార్త్ లో సూపర్ సక్సెస్ సాధించి అత్యధిక TRP రేటింగ్ తో దూసుకెళ్తున్న ఈ షో..సౌత్ లోను అంతే విధంగా రాణిస్తూ వస్తుంది. సీజన్..సీజన్ కు సరికొత్తగా ఆకట్టుకుంటూ ప్రేక్షకుల్లో కొత్తదనం తీసుకొస్తుంది. అలాంటి ఈ షో ఫ్యాన్స్ కు హోస్ట్ షాక్ ఇచ్చాడు. ఆ హోస్ట్ ఎవరు..? ఏ ఇండస్ట్రీ బిగ్ బాస్..? ఏంటా..ఆ బిగ్ షాకింగ్ న్యూస్..? అనుకుంటున్నారా..? తమిళ్ బిగ్ బాస్ (Tamil Big Boss Show) ఫ్యాన్స్ కు హోస్ట్ కమల్ హాసన్ (Kamal Haasan) షాక్ ఇచ్చారు. బిగ్ బాస్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తెలుగు బిగ్ బాస్ కు అనేకమంది హోస్ట్ లు మారినప్పటికీ..తమిళనాట మాత్రం మొదటి నుండి కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తూ అలరిస్తున్నారు. అయితే ఈసారి ఏమనుకున్నారో ఏమోకానీ సడెన్ గా ఈ షో నుండి తప్పుకుంటున్నట్లు ఓ నోట్ రిలీజ్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

తనకు బిగ్ బాస్ షోపై పెద్దగా ఆసక్తి లేదని.. కేవలం తాను కొత్త‌గా పెట్టే పార్టీని న‌డ‌ప‌డానికి అవ‌స‌ర‌మైన డబ్బుల కోసమే ఈ షోను హోస్ట్ చేస్తున్నట్లు గతంలో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు షేర్ చేసిన పోస్ట్ లో ఈ షో నుంచి కొన్ని కారణాల వల్ల తప్పుకున్నట్లు తెలిపాడు. ఇప్పటివరకు నన్ను మీ కుటుంబంలో ఒకడిగా చూసుకున్న ఫ్యాన్స్ కు, బిగ్ బాస్ ఆడియన్స్ కు ధన్యవాదాలు అని రాసుకొచ్చాడు. కమల్ తప్పుకోవడంతో నెక్స్ట్ హోస్ట్ ఎవరనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈయన స్థానంలోకి మరో స్టార్ హీరో శింబు రాబోతున్న‌ట్లు తమిళ మీడియాలో ప్ర‌చారం జరుగుతుంది. కమల్‌తో పోలిస్తే శింబుకు హోస్టింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే లేదు కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది..మరి నిజంగా శింబు హోస్ట్ గా వ్యవహరిస్తారా..? లేదా అనేది చూడాలి.

Read Also : Britain : బ్రిటన్‌ వెళ్లే భారతీయులకు కేంద్రం అడ్వైజరీ జారీ