Kamal Haasan: లగనాయగన్ కమల్ హాసన్- మణిరత్నం- ఏఆర్ రెహమాన్- కె హెచ్ 234 న్యూ మూవీ అనౌన్స్ మెంట్

రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ (RKFI), మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ క్రేజీ కాంబినేషన్ లో కమల్ హాసన్ 234 చిత్రం 2024లో థియేటర్లోకి రానున్నట్లు సగర్వంగా ప్రకటించారు.

Published By: HashtagU Telugu Desk
Kamal Haasan Mani Ratnam Imresizer

Kamal Haasan Mani Ratnam Imresizer

రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ (RKFI), మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ క్రేజీ కాంబినేషన్ లో కమల్ హాసన్ 234 చిత్రం 2024లో థియేటర్లోకి రానున్నట్లు సగర్వంగా ప్రకటించారు. ఉలగనాయగన్ కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందించనున్నారు. ఇద్దరు దిగ్గజాలు కమల్ హాసన్, మణిరత్నంల మ్యాజికల్ కలయిక వచ్చిన నాయగన్ కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. దాదాపు 35 సంవత్సరాల తర్వాత మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ కాబోతుంది. ఉలగనాయగన్ కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్ & శివ అనంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దిగ్గజ నటుడు, దర్శకుడు , నిర్మాత కమల్ హాసన్ మాట్లాడుతూ, “35 సంవత్సరాల క్రితం మణిరత్నంతో పని చేసినపుడు ఎంత ఉత్సాహంగా వున్నానో ఇప్పుడు అంతే ఉత్సాహంగా వుంది. ఒకేరకమైన మనస్తత్వంతోవున్న వారితో కలసి పని చేయడం గొప్ప ఉత్తేజాన్నిస్తుంది. ఈ ఉత్సాహంలో రెహమాన్ కూడా తోడయ్యారు. మిస్టర్ ఉదయనిధి స్టాలిన్‌ తో కలిసి ఈ వెంచర్‌ ని ప్రజంట్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అన్నారు

దర్శకుడు, నిర్మాత మణిరత్నం మాట్లాడుతూ, “కమల్ సర్‌ తో మళ్లీ కలిసి పని చేయడం సంతోషంగా, గౌరవం, ఉత్సాహంగా ఉంది.” అన్నారు.

నటుడు ,నిర్మాత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, “ ఉలగనాయగన్ కమల్ హసన్ గారి 234 చిత్రాన్ని ప్రజంట్ చేయడం గొప్ప గౌరవం, ఒక అద్భుతమైన అవకాశం. కమల్ సర్, మణి సర్ ని అమితంగా ఆరాధిస్తాను. ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు” తెలిపారు.

  Last Updated: 07 Nov 2022, 08:15 AM IST