Indian 2 : శంకర్ అండ్ కమల్ హాసన్ కాంబినేషన్ తో 1996లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘భారతీయుడు’. ఆ సోషల్ మెసేజ్ సినిమాకి ఇరవైఏళ్ళ తరువాత సీక్వెల్ ని ప్రకటించారు. 2019లోనే చిత్రీకరణ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం.. పలు కారణాలు వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఒక భాగంగా షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ మూవీ.. ఇప్పుడు రెండు భాగాలుగా రాబోతుంది.
ఈ రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ పనుల్లో కూడా ఆలస్యం అవుతూనే వస్తుంది. ఇటీవల ఈ మూవీని జూన్ లో రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ అనౌన్స్ చేసారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమా రిలీజ్ ని వాయిదా వేస్తున్నారు. జులైకి ఈ మూవీని పోస్టుపోన్ చేస్తున్నారట. జులై 12న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ ఫిక్స్ అయ్యారట.
ఇక మూవీ రిలీజ్ పోస్టుపోన్ అవ్వడంతో.. ఆడియో లాంచ్ ఈవెంట్ ని కూడా మేకర్స్ వాయిదా వేస్తున్నారు. ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ ని మే 16న గ్రాండ్ నిర్వహించాలని శంకర్ ప్లాన్ చేసారు. ఈక్రమంలోనే ఆ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని ఆహ్వానించారు. ఇప్పుడు ఈ ఆడియో లాంచ్ ని జులై 1వ తారీఖుకి వాయిదా వేశారు. మరి ఆ సమయానికి రజిని, చరణ్ డేట్స్ సర్దుబాటు చేసుకొని అతిథులుగా వస్తారా లేదా చూడాలి.
కాగా ఇండియన్ 2 మూవీకి రామ్ చరణ్ మరో సహాయం కూడా చేస్తున్నారట. ఇండియన్ 2కి రామ్ చరణ్ తో వాయిస్ ఓవర్ చెప్పించాలని శంకర్ ప్లాన్ చేశారట. కమల్ సినిమాకి వాయిస్ ఓవర్ చెప్పాలని శంకర్ అడగడంతో.. చరణ్ వెంటనే ఓకే చెప్పేశారని తెలుస్తుంది.