Kamal Haasan: ‘ప్రాజెక్ట్ కె’లోకి విలక్షణ నటుడు కమల్ హాసన్.. రికార్డులు బద్దలు కావడం ఖాయం..!

ప్రభాస్ నటిస్తోన్న ‘ప్రాజెక్ట్ కె’ నుంచి అదిరే అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో విలక్షణ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటిస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Kamal Haasan

Resizeimagesize (1280 X 720) (3)

Kamal Haasan: ప్రభాస్ నటిస్తోన్న ‘ప్రాజెక్ట్ కె’ నుంచి అదిరే అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో విలక్షణ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటిస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఈ మూవీని నిర్మిస్తున్న వైజయంతి మూవీస్ ట్విట్టర్‌లో ఓ పోస్టర్‌తో పాటు వీడియోను రిలీజ్ చేసింది. దీంతో ఈ మూవీలో ఇద్దరు సూపర్ స్టార్స్‌ను ఒకే స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ ఉన్నారని న్యూస్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు దీనిపై మేకర్స్ అధికారికంగా ఆ బిగ్ అప్డేట్ ని విడుదల చేశారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ భాగస్వామ్యం అయ్యినట్టుగా ఓ వీడియోతో కన్ఫర్మ్ చేసారు. మొత్తానికి అయితే ప్రాజెక్ట్ కే మరింత భారీ స్థాయిలో వెళ్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే కమల్ ప్రాజెక్ట్ కే షూటింగ్ లో ఇప్పుడు జాయిన్ అయ్యినట్టు గా తెలుస్తోంది. కమల్ పై నాలుగు వారాల పాటుగా షూటింగ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వైజయంతి మూవీస్ వారు భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే, బిగ్ బి వంటి స్టార్స్ భాగం అయిన విషయం తెలిసిందే.

Also Read: Message Pin Duration : వాట్సాప్ మెసేజ్ ఇక పిన్ చేసేయండి

అయితే.. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టైటిల్‍, మోషన్ పోస్టర్‌ను జూలై రెండవ లేదా మూడవ వారంలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దీని లాంచ్ ఈవెంట్ యూఎస్ఏలో గ్రాండ్ గా జరగబోతుందని సమాచారం. వరల్డ్ వైడ్ బజ్ క్రియేట్ చేయడానికి మేకర్స్ ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

  Last Updated: 25 Jun 2023, 02:29 PM IST