Kalyan Dilip Sunkara : ఇటీవల లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ పై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి, శారీరికంగా వాడుకొని, గుళ్లో పెళ్లి చేసుకొని, అబార్షన్ చేయించాడని లావణ్య కేసు పెట్టింది. అలాగే రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రాని పెళ్లి చేసుకోబోతున్నాడని, అందుకే నన్ను వదిలేసాడని, వాళ్ళు నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారని మాల్వి మల్హోత్రా, ఆమె సోదరుడిపై కూడా కేసు పెట్టింది.
గత నాలుగు రోజులుగా లావణ్య రోజూ మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూ, రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేస్తూ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ కేసులోకి లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర లావణ్య తరపున వాదించడానికి వచ్చారు.
నేడు న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర మీడియాతో మాట్లాడుతూ.. ఒక అమ్మాయికి న్యాయం చేయాలని నేను ఈ కేసు తీసుకున్నాను. హీరో రాజ్ తరుణ్ నా క్లయింట్ లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుకొని అవసరం తీరాక వదిలేయడం కరెక్ట్ కాదు. నార్సింగ్ పోలీసులకు ఆల్రెడీ అన్ని ఆధారాలు సమర్పించాము. ఆధారాలను చూసి పోలీసులు మూడు సెక్షన్స్ కింద రాజ్ తరుణ్ పై మరో ఇద్దరుపై కేసు నమోదు చేశారు. పోలీసులు రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాను. ఒకవేళ రాజ్ తరుణ్ కోర్టుకి వెళ్తే అక్కడ కూడా వెళ్లి వాదిస్తాను అని తెలిపారు. ఈ కేసులో నర్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాలపై కేసు నమోదు చేశారు.
Also Read : Thiragabadara Saami : రాజ్ తరుణ్ దెబ్బకు తల పట్టుకున్న మల్కాపురం శివకుమార్..?