Site icon HashtagU Telugu

Prabhas Kalki: ప్రభాస్ కల్కి ఇప్పట్లో కష్టమేనా ?

Prabhas Kalki

Prabhas Kalki

Prabhas Kalki: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కోట్లు కొల్లగొడుతుంది. సలార్ తర్వాత ప్రభాస్ నటిస్తోన్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే. ఈ చిత్రానికి మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు డిపరెంట్ మూవీ అనుకున్నారు కానీ. ఇది ఎంత డిపరెంట్ మూవీనో కల్కి అని టైటిల్ ప్రకటించి.. టీజర్ రిలీజ్ చేసిన తర్వాత అందరికీ అర్థమైంది. ఈ చిత్రాన్ని సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఏమాత్రం రాజీపడకుండా అద్భుతమైన చిత్రాన్ని అందించాలనే తపనతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటిస్తుంది. కీలక పాత్రలో మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నటిస్తుంది. ఇక కీలక పాత్రలో అమితాబ్.. విలన్ పాత్రలో కమల్ హాసన్ నటిస్తుండడం విశేషం. అమెరికాలో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అయితే.. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కదురలేదు. ఆతర్వాత రీసెంట్ గా ముంబాయిలో ఈ సినిమా గురించి మీడియా మీట్ నిర్వహించారు. అక్కడ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

ఈ మూవీ ట్రైలర్ మార్చి నెలాఖరున లేదా ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తామన్నారు. రిలీజ్ డేట్ త్వరలో అనౌన్స్ చేస్తామన్నారు. అయితే.. మే నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు సమ్మర్ లో కల్కి రావడం లేదని టాక్ వినిపిస్తోంది. తాజా వార్త ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ స్టేజ్ ఉంది. ఇంకా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాలి. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఆరు నెలల టైమ్ పడుతుందట. అందుచేత సమ్మర్ లో కల్కి రావడం అనేది డౌటే అని టాక్ బలంగా వినిపిస్తోంది. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

Also Read: CM Revanth: తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధికి మెగా మాస్టర్ పాలసీ: సీఎం రేవంత్