Prabhas Kalki: క‌ల్కీ దెబ్బ‌కు ఆ స్టార్ హీరోల రికార్డులు బ్రేక్‌

Prabhas Kalki: దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెర కెక్కిన తాజా చిత్రం కల్కి 2898 ఎడితో బాక్సాఫీస్ ను డామినేట్ చేస్తూ ప్ర భాస్ మరోసారి త న స్టార్ ప వ ర్సిటీని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ఐదు ప్రధాన భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ప్రపంచ ప్రేక్షకులను, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల ప్రేక్షకులను ఆకట్టుకునే సత్తా ఉన్న ఈ సినిమాను ఇంగ్లీష్ లో విడుదల చేస్తారనే వార్త కోసం […]

Published By: HashtagU Telugu Desk
Kalki Collections

Kalki Collections

Prabhas Kalki: దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెర కెక్కిన తాజా చిత్రం కల్కి 2898 ఎడితో బాక్సాఫీస్ ను డామినేట్ చేస్తూ ప్ర భాస్ మరోసారి త న స్టార్ ప వ ర్సిటీని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ఐదు ప్రధాన భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ప్రపంచ ప్రేక్షకులను, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల ప్రేక్షకులను ఆకట్టుకునే సత్తా ఉన్న ఈ సినిమాను ఇంగ్లీష్ లో విడుదల చేస్తారనే వార్త కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం యూఎస్ బాక్సాఫీస్ వద్ద టాప్ 10 సినిమాల జాబితాలో ఈ చిత్రం మూడో స్థానంలో ఉంది.

ఇంగ్లీష్ వెర్షన్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, నెట్ ఫ్లిక్స్ లో ఆంగ్లంలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో రానున్నట్టు తెలుస్తోంది. అయితే  ఈ మూవీ సలార్: పార్ట్ 1 – లియో, కాంతారా, గ్లోబల్ సెన్సేషన్ ఆర్ఆర్ఆర్ సినిమాల కలెక్షన్లు దాటే అవకాశం ఉందని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్న ప్రభాస్ పలువురి హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది. మరో వార్త ఏమిటంటే కల్కి 2898 ఏడీకి సీక్వెల్ రాబోతోందని, త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుందని సమాచారం.

  Last Updated: 02 Jul 2024, 09:14 PM IST