Nag Ashwin: కల్కి ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను, యావత్ దేశాన్ని గర్వించేలా చేస్తుంది: నాగ్ అశ్విన్

  • Written By:
  • Publish Date - June 10, 2024 / 11:39 PM IST

Nag Ashwin: మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’, మ్యాసీవ్ అంచనాలతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ ఫైనల్లీ రిలీజ్ అయ్యింది. ‘కల్కి 2898 AD’ సినిమాటిక్ యూనివర్స్ ని ఎక్స్ ట్రార్డినరీగా పరిచయం చేస్తూ రెండు నిమిషాల యాభై ఒక్క సెకన్ల నిడివి గల ట్రైలర్ ప్రేక్షకులను ఇండియన్ మైథాలజీ వరల్డ్ లోకి తీసుకెళ్ళింది.

ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ “ఈ రోజు నా మనసు చాలా ఎమోషన్స్ తో నిండి ఉంది. ఒక ఫిల్మ్ మేకర్స్ గా ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ పట్ల నాకు చాలా పాషన్. ‘కల్కి 2898 AD’లో ఈ రెండు ఎలిమెంట్స్ ని మెర్జ్ చేయడం మా ఆర్టిస్ట్ లు. టీం అద్భుతమైన ప్రతిభ, అంకితభావం వల్ల సాధ్యమైంది. ఈ కలని సాకారం చేసుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. మా నిర్మాతలు, స్టార్ కాస్ట్ నుంచి అద్భుతమైన కక్రియేటివ్ మైండ్స్, ‘కల్కి 2898 AD’ మొత్తం సిబ్బంది, ప్రతి వ్యక్తి ఈ చిత్రానికి ప్రాణం పెట్టి పని చేశారు. ఈ ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను, యావత్ దేశాన్ని గర్వించేలా చేస్తుందని, సినిమా కోసం వారిని ఎక్సయిట్ చేసేలా ఉంటుందని మేము ఆశిస్తున్నాము’ అన్నారు.

పవర్-ప్యాక్డ్ డైలాగ్‌లు, అద్భుతమైన బీజీఎం, టాప్ క్లాస్ VFXతో, ‘కల్కి 2898 AD’ ట్రైలర్ ప్రేక్షకులు ఆడ్రినలిన్-ఫ్లూయిడ్ తో కూడిన సినిమాటిక్ జర్నీని హామీ ఇస్తుంది. ప్రతి అంశంలోనూ అద్భుతం అనిపిస్తూ, బెస్ట్ ఇంటర్ నేషనల్ సినిమా ఎక్స్ పీరియన్స్ ని అందిస్తూ, మేకర్స్ ఎక్స్ ట్రార్డినరీ ట్రైలర్‌ను అందించారు.