Kalki In Ott: ఈ నెలలోనే కల్కి ఓటీటీ రిలీజ్..? ఆ 6 నిముషాలు కట్ చేసారు అని టాక్

అనేక అంచనాల మధ్య జూన్ 27 న రిలీజ్ అయిన ప్రభాస్ చిత్రం “కల్కి 2898 AD” (Kalki) అంచనాలకి మించి భారీ విజయాన్ని (Super Success) అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ (Box Office) వద్ద 1100 కోట్ల మార్క్ దాటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్ప్పటికీ బుక్ మై షో లో టికెట్స్ (Book My Show) కూడా బానే తెగుతున్నాయి అని టాక్. డైరెక్టర్ నాగ్ అశ్విన్ […]

Published By: HashtagU Telugu Desk
Kalki Movie In Ott

Kalki Movie In Ott

అనేక అంచనాల మధ్య జూన్ 27 న రిలీజ్ అయిన ప్రభాస్ చిత్రం “కల్కి 2898 AD” (Kalki) అంచనాలకి మించి భారీ విజయాన్ని (Super Success) అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ (Box Office) వద్ద 1100 కోట్ల మార్క్ దాటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్ప్పటికీ బుక్ మై షో లో టికెట్స్ (Book My Show) కూడా బానే తెగుతున్నాయి అని టాక్.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఈ సినిమాని హాలీవుడ్ రెంజ్ (Hollywood Range) కి ఎక్కడ తగ్గకుండా తెరకెక్కించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ (Kamal Hasan) మరియు దీపికా పదుకొనె (Deepika Padukone) లాంటి భారీ తారాగణం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఊహించని గెస్ట్ రోల్స్ (Guest Role) కూడా బానే అలరించాయి. మహాభారతం ఎపిసోడ్ అయితే సినిమాని మళ్ళి మళ్ళి చూడాలి అనిపించే అంత బావుంది. మొత్తంమీద యంగ్ రెబెల్ స్టార్ (Rebel Star) కెరీర్ లో మరో మైలు రాయి గా (Mile Stone) నిలిచినా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం సినిమా అభిమానులు (Fans) అంత ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా యొక్క స్ట్రీమింగ్ హక్కులని గతంలోనే భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అయితే ఈ నెలలోనే ఆన్లైన్ స్ట్రీమింగ్ (Online Streaming) కి ప్రైమ్ యాజమాన్యం (Amazon Prime) కసరత్తులు చేస్తుంది. ఆగష్టు 23 నుంచి ఓటీటీ లో  (OTT) అందుబాటులో ఉండబోతోంది అని టాక్ నడుస్తుంది. థియేటర్ లో నిడివి సమస్య ఈ సినిమాని కూడా వదలలేదు కనుక ఒక 6 నిమిషాలు కట్ చేసి సినిమాని ఓటీటీ లో అందుబాటులో ఉంచాలి అని చిత్ర బృందం ఆలోచనలో ఉంది, అయితే దీని గురించి యైజయంతి మూవీస్ నుంచి లేదా, అమెజాన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

  Last Updated: 12 Aug 2024, 07:26 PM IST