Site icon HashtagU Telugu

Kalki First Day Collections : ఓవర్సీస్ లో రికార్డ్స్ బ్రేక్ చేసిన ప్రభాస్..

Kalki 1st Day Collections

Kalki 1st Day Collections

ప్రభాస్ (Prabhas) మరోసారి రికార్డ్స్ బ్రేక్ చేయడం మొదలుపెట్టారు. బాహుబలి (Baahubali) తర్వాత ఆ రేంజ్ లో హిట్ పడకపోయేసరికి అభిమానులంతా అసలైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు కల్కి (Kalki ) తో బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తో అభిమానుల సంబరాలు మాములుగా లేవు. ఈ సినిమా ఫై ముందు నుండి కూడా భారీ అంచనాలు నెలకొని ఉండడం తో అన్ని ఏరియాల్లో ఈ చిత్ర రైట్స్ ను భారీ ధరపెట్టి కొనుగోలు చేసారు. ఇక ఇప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ విజయం కావడం తో మొదటి రోజే భారీ కలెక్షన్లు రావడం తో వారంతా హ్యాపీగా ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ 70 కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ సినిమాను సుమారుగా 4500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. కల్కి మూవీని ప్రీమియర్స్‌కు రికార్డు కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ మూవీకి ప్రీమియర్ల ద్వారా ఉత్తర అమెరికా అంటే.. యూఎస్, కెనడాలో $3,859,967 డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 32.20 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. ఇది నార్త్ అమెరికాలో ఇది ఆల్ టైమ్ రికార్డుగా ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. ఇండియా లో మొదటి రోజు రూ.100- 110 కోట్లు వసూలు చేస్తుందని, ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు దాటుతుందని అంటున్నారు. గత ఆరు నెలలుగా పెద్దగా హిట్ లేని హిందీ మూవీ ఇండస్ట్రీకి, ఈ సినిమా చాలా అవసరం అంటూ పేర్కొంటున్నారు. హిందీలో కూడా ‘కల్కి 2898 AD’లో అతిపెద్ద ఓపెనింగ్స్‌ రాబట్టిన మూవీగా నిలిచింది. రూ.20.50 కోట్లు ఆర్జించిన ‘ఫైటర్’ని అధిగమించింది.

Read Also : Rajamouli – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో రాజమౌళి చర్చలు..