నందమూరి వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి తెలిసిందే. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమా మొదలు అవ్వాల్సి ఉన్నా ఏవో కారణాల వల్ల స్టార్ట్ కాలేదు. ఐతే మోక్షజ్ఞ తొలి సినిమా కాదు రెండోది, మూడో సినిమా కూడా లైన్ లో పెడుతున్నారు. మోక్షజ్ఞ తో ప్రశాంత్ వర్మ ఆల్రెడీ సినిమాకు రెడీ కాగా వెంకీ అట్లూరి కూడా లైన్ లో ఉన్నాడని తెలుస్తుంది.
లేటెస్ట్ గా కల్క్సి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కూడా మోక్షజ్ఞ (Mokshagna) సినిమా ఉంటుందని టాక్ నడుస్తుంది. ఎవడే సుబ్రమణ్యం, మహానటి, కల్కి 2898 ఏడి తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కల్కి (Kalki) 2 పనుల్లో బిజీగా ఉన్న నాగ్ అశ్విన్ నెక్స్ట్ సినిమా మోక్షజ్ఞతో చేసేలా చర్చలు జరుగుతున్నాయట.
ఈ సినిమాను కూడా వైజయంతి మూవీస్ నిర్మిస్తుందని తెలుస్తుంది. మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా మొదలు అవ్వకముందే రెండోది మూడోది అంటూ ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ఏది ఏమైనా బాలయ్య తన వారసుడిని రంగంలోకి దించే క్రమంలో భారీ కాంబినేషన్స్ సెట్ చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమా అసలైతే మొన్ననే పూజా కార్యక్రమాలు జరుపుకోవాలి కానీ ఏమైందో ఏమో కానీ అది జరగలేదు.
ఇక కల్కి నాగ్ అశ్విన్ తో మోక్షజ్ఞ సినిమా అని తెలియగానే నందమూరి ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ఐతే మోక్షజ్ఞ తో బాలయ్య (Balarkrishna,) ఆదిత్య 999 సినిమా కూడా చేస్తాడని తెలిసిందే.