Site icon HashtagU Telugu

Pushpa 2 : కల్కి ఎఫెక్ట్ పుష్ప 2 పై కూడానా..?

Allu Arjun Koratala Siva is on Cards

Allu Arjun Koratala Siva is on Cards

Pushpa 2 ప్రభాస్ కల్కి సినిమా బాక్సాఫీస్ దూకుడు చూస్తుంటే నెవర్ బిఫోర్ రికార్డులను సృష్టించేలా ఉన్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమా యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా కల్కినే అని చెప్పొచ్చు. కల్కి సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న ప్రతి సినిమాకు ఒక పెద్ద ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇదే లైన్ లో ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్న పుష్ప 2 సినిమాకు మీద కూడా కల్కి ఎఫెక్ట్ పడుతుందని చెప్పొచ్చు.

పుష్ప 2 మీద కల్కి ఎలా ఎఫెక్ట్ పడుతుంది అంటే. పాన్ ఇండియా సినిమా అనగానే ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉంటాయి. వాటికి తగినట్టుగా సినిమా ఉండాలి లేదంటే తిప్పికొట్టేస్తారు. ఐతే కల్కి సినిమా సృష్టిస్తున్న సంచలనాలు చూస్తుంటే ఇది కదా సినిమా అంటే అనిపించేలా ఉన్నాయి. ఈ ఎఫెక్ట్ కచ్చితంగా పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా మీద ఉంటుంది.

ముఖ్యంగా పుష్ప 1 తో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 తో మరో సంచలనానికి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాను సుకుమార్ కూడా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో ఉన్నాడు. ఐతే కల్కి పాన్ ఇండియా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. అదే రేంజ్ లో పుష్ప 2 వస్తుందా అన్నది చూడాలి. ఐతే కథల ప్రకారంగా చూస్తే రెండు వేరే అయినా ఇంపాక్ట్ మాత్రం అదే రేంజ్ లో క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మరి కల్కి సినిమా ని దాటేలా పుష్ప 2 ఉంటుందా రేసులో అల్లు అర్జున్ సినిమా ఎలాంటి హంగామా చేస్తుంది అన్నది చూడాలి.

Also Read : Pooja Hegde : ఇంతకీ ఆ సినిమాలో బుట్ట బొమ్మ ఉందా లేదా..?