Site icon HashtagU Telugu

Prabhas : సినిమా ప్లాప్ అయితే ప్రభాస్ ఏం చేస్తాడో తెలుసా..?

Kalki 2898 Ad Star Prabhas What To Do When Cinema Gone Flop

Kalki 2898 Ad Star Prabhas What To Do When Cinema Gone Flop

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ వరల్డ్ మూవీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. బాహుబలి వంటి యూనివర్సల్ సబ్జెట్ తరువాత.. హాలీవుడ్ ఫ్యూచరిస్టిక్ మూవీ తరహాలో కల్కి సినిమాని తీసుకు వస్తున్నారు. ఈ మూవీ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి రిలీజ్ అయిన తరువాత ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి. కాగా బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్స్ గా నిలిచాయి.

బాహుబలి ముందు కూడా ప్రభాస్ కి మర్చిపోలేని ప్లాప్స్ ఉన్నాయి. మరి ఆ ప్లాప్స్ ఎదురైనప్పుడు ప్రభాస్ ఏం చేస్తారు..? ఆ ప్లాప్ ఫేస్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు..? ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఛత్రపతి మూవీ సక్సెస్ తరువాత ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో.. సక్సెస్ వచ్చినప్పుడు ప్రభాస్ ఎలా ఉంటాడు..? ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎలా ఉంటారు..? అని ప్రశ్నించారు.

దీనికి ప్రభాస్ బదులిస్తూ.. “సక్సెస్ వస్తే సంతోషంలో ఎక్కువ మాట్లాడేస్తుంటా. ఛత్రపతి హిట్ అని తెలిసిన తరువాత రాజమౌళికి ఫోన్ చేసి డార్లింగ్ డార్లింగ్ అంటూ ఆ ఒక్క మాటనే రిపీట్ చేస్తూ మాట్లాడాను. ఇక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మాత్రం ఆ టెన్షన్ తట్టుకోలేక ఎక్కువ తినేసి పడుకుంటా. నిద్ర లేచిన తరువాత అంతా సెట్ అయ్యిపోతుంది” అంటూ చెప్పుకొచ్చారు.

ఇక అదే ఇంటర్వ్యూలో ప్రభాస్ కాలేజీ ఫ్రెండ్ కూడా పాల్గొనగా.. ప్రభాస్ గురించిన పలు విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రభాస్ కి స్టార్‌డమ్ రాకముందు ఎలా ఉన్నాడో, వచ్చాక కూడా అలాగే ఉన్నాడని చెప్పుకొచ్చారు. తన ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదని చెప్పుకొచ్చారు. ఇక కాలేజీలో ప్రభాస్ యావరేజ్ స్టూడెంట్ అని పేర్కొన్నారు.