Prabhas : ఇన్‌స్టాలో ప్రభాస్ ఇంటరెస్టింగ్ పోస్ట్.. పెళ్లి గురించేనా..?

రెబల్ స్టార్ ప్రభాస్ తన ఇన్‌స్టా స్టోరీలో ఇలా రాసుకొచ్చారు. డార్లింగ్స్, ఫైనల్లీ ఒక ముఖ్యమైన వ్యక్తి..

Published By: HashtagU Telugu Desk
Kalki 2898 Ad Star Prabhas Instagram Story Post Is About His Marriage

Kalki 2898 Ad Star Prabhas Instagram Story Post Is About His Marriage

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ జరుపుతూ, వరుస సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తూ అలరిస్తున్నారు. ప్రొఫిషినల్ గా అందర్నీ సంతృప్తి పరుస్తూ వస్తున్న ప్రభాస్.. పర్సనల్ లైఫ్ లో మాత్రం ఇంకా సింగల్ గానే ఉంటూ వస్తున్నారు. అభిమానులంతా ప్రభాస్ పెళ్లి వార్త కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి మాటని పక్కన పెట్టేసి సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

అయితే ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి.. ప్రభాస్ పెళ్లి ఈ ఏడాదిలో కన్ఫార్మ్ గా జరిగిపోతుందని చెప్పుకొచ్చారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఆ పెళ్లి వార్త కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వేసిన ఓ పోస్ట్ అందరికి పెళ్లి సంకేతాలు ఇస్తున్నాయి. ప్రభాస్ తన ఇన్‌స్టా స్టోరీలో ఇలా రాసుకొచ్చారు.. “డార్లింగ్స్, ఫైనల్లీ ఒక ముఖ్యమైన వ్యక్తి మన లైఫ్ లోకి రాబోతున్నారు. వెయిట్ చేయండి” అంటూ రాసుకొచ్చారు. ఈ కామెంట్స్ చూసిన నెటిజెన్స్‌కి, అభిమానులకు.. పెళ్లి గురించేనా ఈ పోస్ట్ అనే సందేహం కలుగుతుంది.

మరి ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరు..? ఆ వ్యక్తి రాబోతుంది పర్సనల్ లైఫ్ లోకా..? లేక ప్రొఫిషినల్ లైఫ్ లోకా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కాగా ప్రభాస్ కి ప్రస్తుతం 44 ఏళ్ళు. మరి ఇన్నాళ్లు పెళ్లికి దూరంగా ఉన్న మన డార్లింగ్.. ప్రేమ పెళ్లి చేసుకుంటారా..? లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా..? అనేది కూడా వేచి చూడాలి.

  Last Updated: 17 May 2024, 11:20 AM IST