Kalki 2898 AD రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న కల్కి 2898 ఏడి సినిమా సమ్మర్ బరిలో మే 9న రిలీజ్ ప్లాన్ చేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దీపిక పదుకొనె హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. కమల్ హాసన్ ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పటాన్ నటిస్తున్నారు. ఈ సినిమా మే 9న రిలీజ్ ఫిక్స్ చేసినా సినిమా అనుకున్న డేట్ కి రావడం కష్టమని తెలుస్తుంది.
కల్కి 2898 ఏడి సినిమా రిలీజ్ దాదాపు వాయిదా పడినట్టే అని తెలుస్తుంది. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ అనుకున్న టైం కు పూర్తి చేయడం కుదరదని డిసైడ్ అయ్యారట. అందుకే సినిమాను వాయిదా వేయాలని ఫిక్స్ అయ్యారట. కల్కి సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు.. సినిమా విషయంలో మేకర్స్ ప్లాన్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.
కల్కి సినిమా విజువల్ వండర్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో ప్రభాస్ కమల్ హాసన్ మధ్య సీన్స్ విజువల్ ఫీస్ట్ అందిస్తాయని తెలుస్తుంది. సినిమాను మే 9 నుంచి వాయిదా వేసినా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నది త్వరలో చెప్పనున్నారు.