Site icon HashtagU Telugu

Kalki 2898 AD : కల్కిలో మరో ఏడు నగరాలు.. ప్రొడక్షన్ డిజైనర్ కామెంట్స్ వైరల్..

Kalki 2898 Ad, Prabhas, Amitabh Bachchan

Kalki 2898 Ad, Prabhas, Amitabh Bachchan

Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898 ఎడి’. అమితాబ్ బచ్చన్ ‘అశ్వథామ’గా నటించిన ఈ చిత్రంలో కమల్ హాసన్ ‘సుప్రీమ్ యక్షిణ్’ అనే విలన్ పాత్రలో కనిపించారు. కాగా ఈ సినిమాలో మొత్తం మూడు నగరాలను చూపించారు. ఒకటి కాశీ, రెండు శంభల, మూడు కాంప్లెక్స్. అయితే ఈ మూడు నగరాలు కాకుండా మరో ఏడు నగరాలు కూడా ఉన్నాయట. ఈ విషయం గురించి ఆ మూవీ ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహాని ఆసక్తికర కామెంట్స్ చేసారు.

“కల్కి ప్రపంచంలో మొత్తం ఏడు కాంప్లెక్స్ లు ఉన్నాయి. మీరు కల్కి పార్ట్ 1లో చూసింది కేవలం ఒక కాంప్లెక్స్ మాత్రమే. మిగిలిన ఆరు కాంప్లెక్స్ తో పాటు అన్నిటిని సుప్రీమ్ యక్షిణే రూల్ ఉంటాడు” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవ్వడంతో ఆడియన్సు లో కల్కి యూనివర్స్ పై మరింత ఆసక్తి ఎక్కువైంది. మరి సెకండ్ పార్ట్ లో మిగిలిన ఆ ఆరు కాంప్లెక్స్ లను కూడా చూపిస్తారా లేదా చూడాలి.

ఇది ఇలా ఉంటే, ఈ మూవీ పై ఓ స్వామిజి పోలీస్ కేసు నమోదు చేసారు. కల్కి అవతారం గురించి మన పురాణాల్లో ఎంతో స్పష్టంగా ఉందని, కానీ మూవీ మేకర్స్ ఆ కథని కాకుండా వేరే కథను చూపించడం.. హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని కేసు నమోదు చేసారు. ఈక్రమంలోనే చిత్ర నిర్మాతలతో పాటు ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ కి కూడా లీగల్ నోటీసులు పంపించారు. మరి దీని పై మూవీ టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.