Site icon HashtagU Telugu

Kalki 2898 AD OTT Release : కల్కి ఓటీటీ రిలీజ్ ఎప్పుడు.. ఎందులో వస్తుంది..?

Kalki 2898 AD OTT Release Date

Kalki 2898 AD OTT Release Date

ప్రభాస్ కల్కి సినిమా రెండో వారం లో కూడా థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఇప్పటికే వసూళ్ల పరంగా 1000 కోట్ల మార్క్ కి దగ్గరగా ఉందని తెలుస్తుండగా సినిమా లాంగ్ రన్ లో భారీ వసూళ్లను తీసుకొస్తుందని అంటున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడి (Kalki 2898 AD) సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె లు కూడా తమ పత్రలతో మెప్పించారు.

సినిమ్నాలో ప్రభాస్ (Prabhas) కు ఎంత ఇంపార్టెంట్ ఉందో మిగతా పాత్రలకు అంతే వెయిట్ ఉంది. ఆ పాత్రలకు వారి అభినయం అదిరిపోయింది. ఇక కల్కి సినిమా థియేట్రికల్ రన్ మరో రెండు వారాలు కొనసాగేలా ఉంది. ఐతే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం కొందరు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సినిమా చూస్తే థియేటర్ లోనే చూడాలని అంటున్నా కొందరు డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు ఓటీటీలోకి వచ్చాక చూసేద్దాం అనుకుంటున్నారు.

ఐతే ఈ సినిమాను రెండు ఓటీటీ సంస్థలు డిజిటల్ రైట్స్ కొన్నాయని తెలుస్తుంది. అమేజాన్ ప్రైం (Amazon Prime), నెట్ ఫ్లిక్స్ (Netflix) రెండు దిగ్గజ ఓటీటీ సంస్థలు కల్కి హక్కులు పొందాయి. నెట్ ఫ్లిక్స్ లో కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రైం వీడియోలో సౌత్ అన్ని భాషల్లో అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ వెర్షన్స్ అందుబాటులో ఉంటుంది. కల్కి ఓటీటీ రైట్స్ కోసం కూడా ఓటీటీ సంస్థలు భారీ ధర పలికినట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం 8 వారాలు ఆగుతారని తెలుస్తుంది. అంటే థియేట్రికల్ రన్ పూర్తిగా ఆగిపోయాక ఓటీటీ రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. సో అలా అయితే ఆగష్టు 15న కల్కి ఓటీటీ (Kalki OTT Release) రిలీజ్ ఉంటుందని చెప్పొచ్చు. డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా కల్కి భారీ రికార్డులను కొల్లగొట్టడం ఖాయమని చెప్పొచ్చు.