Prabhas : ప్రభాస్ అటు తెలంగాణలోనూ, ఇటు ఏపీలోనూ ఓటు వేయలేదు.. అసలు ఎక్కడున్నాడు..?

ప్రభాస్ అటు తెలంగాణలోనూ, ఇటు ఏపీలోనూ ఓటు వేయలేదు.. అసలు రెబల్ స్టార్ ఎక్కడున్నాడు..?

Published By: HashtagU Telugu Desk
Kalki 2898 Ad Movie Star Prabhas Didnt Cast His Vote In Elections 2024

Kalki 2898 Ad Movie Star Prabhas Didnt Cast His Vote In Elections 2024

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్.. పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ లో ఏం చేసినా అది తప్పకుండా నేషనల్ వైడ్ లో వైరల్ అవుతుంది. అలాంటి ప్రభాస్ ఒక పౌరుడిగా తాను నిర్వర్తించాల్సిన ఒక పబ్లిక్ రెస్పాన్సిబిలిటీని.. ఫాలో అవ్వడం లేదంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. నేడు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్, ఏపీలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ కి ఎన్నికలు జరుగుతున్నాయి.

దీంతో ప్రతి పౌరుడు తమ ఓటు హక్కుని ఉపయోగించుకునేందుకు దేశాలు, రాష్ట్రాలు దాటి పోలింగ్ బూత్స్ వద్దకి వచ్చారు. ఈక్రమంలోనే సినిమా హీరోలు సైతం తమ ఓటు హక్కుని ఉపయోగించుకొని.. తమ అభిమానులు కూడా ఓటు వేసి తమ భాద్యతని నిర్వర్తించాలని విజ్ఞప్తులు చేసారు. చిరంజీవి, రాజశేఖర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాని.. ఇలా ప్రతి హీరో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

అయితే ప్రభాస్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రభాస్ కనిపించకపోతే.. తన ఓటు ఏపీలో ఉండి ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో కూడా ప్రభాస్ ఎక్కడా కనిపించలేదు. దీంతో ప్రభాస్ అసలు వేసారో లేదో అన్న సందేహం మొదలయింది. నడవలేని స్థితిలో ఉన్న కోటశ్రీనివాసరావు వంటి వయసు అయిన ఆర్టిస్టులు కూడా పోలింగ్ బూత్ వద్దకి వచ్చి తమ ఓటు హక్కుని ఉపయోగించుకున్నారు.

కానీ ప్రభాస్ ఇటు తెలంగాణలో, అటు ఏపీలో ఏ పోలింగ్ బూత్ దగ్గర కనిపించకపోవడంతో.. పలువురు విమర్శలు చేస్తున్నారు. కోటశ్రీనివాసరావు వీడియోని షేర్ చేస్తూ ప్రభాస్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఒక పాన్ ఇండియా హీరో పొజిషన్ లో ఉన్న ప్రభాస్.. తన ఓటు హక్కుని ఉపయోగించుకోకుండా, తన అభిమానులకు ఎలాంటి మెసేజ్ ని ఇస్తున్నారు..? ఇదేనా ఒక భాద్యత గల పౌరుడి లక్షణం..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రభాస్ అసలు ఓటు వేసారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.

  Last Updated: 13 May 2024, 06:34 PM IST