kalki 2898 AD Censor : ప్రభాస్ ‘కల్కి’ సెన్సార్ పూర్తి

సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు

Published By: HashtagU Telugu Desk
Kalki Censor

Kalki Censor

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ సెన్సార్ పూర్తి చేసుకుంది. ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి (Kalki 2898 AD) సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి సినిమాఫై మరింత ఆసక్తి నింపిన మేకర్స్..తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు. మొత్తం 2.58 గంటలు రన్ టైమ్ ఉండనున్నట్లు సమాచారం. సినిమా అద్భుతంగా ఉందని, తెలుగు సినిమా చుస్తున్నామా..? హాలీవుడ్ మూవీ చుస్తున్నామా అనే ఫీలింగ్ కలిగించారని అంటున్నారు. విజువల్స్ అదిరిపోయాయని, ఎమోషన్స్ & ఎంటర్టైన్మెంట్ ను సమపాళ్లలో చూపించారని సెన్సార్ టీమ్ అభిప్రాయపడినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ మూవీ లో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ జోడి గా నటిస్తుండగా.. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాత అశ్విని దత్ ఈ మూవీ నిర్మించగా… సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు.

Read Also : Baramulla Encounter: జమ్మూలో తుపాకీ మోత.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

  Last Updated: 19 Jun 2024, 03:49 PM IST