Site icon HashtagU Telugu

Kalki 2 : కల్కి 2 లో అది ఏరు ఊహించలేనట్టుగా..!

Ashwini Dutt Kalki

Ashwini Dutt Kalki

Kalki 2 ప్రభాస్ కల్కి సినిమా రీసెంట్ గా రిలీజై సంచలన విజయం అందుకుంది. నాగ్ అశ్విన్ సృష్టించిన ఒక కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్ అంతా గొప్పగా ఆస్వాధిస్తున్నారు. కల్కి సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ పాత్రలు హైలెట్ గా నిలిచాయి. సినిమాలో దీపిక పాత్ర కూడా అదిరిపోగా తక్కువ సీన్సే ఉన్నా కూడా లోకనాయకుడు కమల్ హాసన్ నెక్స్ట్ లెవెల్ అనిపించాడు.

కల్కి సినిమా చూసిన తర్వాత సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అసలు ఈ సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతుంది అన్న ఎగ్జైట్ మెంట్ ఆడియన్స్ లో ఉంది. ఐతే కల్కి 2 లో కమల్ పాత్ర కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఐతే నిర్మాత అశ్వనిదత్ ఇప్పటికే కల్కి 2 కి సంబందించిన పోర్షన్ 60 శాతం పూర్తైందని సర్ ప్రైజ్ చేశారు. సో కల్కి 2 ఎప్పుడో కాదు నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తుందుఇ.

కల్కి 1 లో ప్రభాస్ తర్వాత అమితాబ్ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో.. కల్కి 2 లో కమల్ హాసన్ గురించి అలా చెప్పుకుంటారని అంటున్నారు. నెగిటివ్ పాత్రలో కమల్ అదరగొట్టేస్తారని తెలుస్తుంది. కల్కి 1 సూపర్ హిట్ అవ్వడంతో కల్కి 2 సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి. తప్పకుండా కల్కి 2 కూడా నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని అంటున్నారు.

Also Read : Nani Srikanth Odela : నాని దసరా కాంబో షాక్ అయ్యే బడ్జెట్..!