Site icon HashtagU Telugu

Kalki 2 : 2025 సమ్మర్ కి రిలీజ్ సాధ్యమేనా..?

Ashwini Dutt Kalki

Ashwini Dutt Kalki

Kalki 2 ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి సినిమా మొదటి పార్ట్ సెన్సేషనల్ హిట్ కాగా సినిమా రెండో భాగం ఎలా ఉండబోతుంది అన్న ఎగ్జైట్ మెంట్ ఏర్పడింది. కల్కి సినిమా పార్ట్ 1 లో కమల్ పాత్ర చాలా తక్కువ ఉంది. ఐతే సెకండ్ పార్ట్ లో ఆయన పోర్షన్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. ఇదిలాఉంటే కల్కి 2 సినిమా గురించి ఇటీవల నిర్మాత అశ్వనిదత్ సినిమా దాదాపు 60 శాతం పూర్తైందని అన్నారు. అంటే కల్కి 1 తో పాటే కల్కి 2 కి సంబందించిన కొన్ని పోర్షన్స్ కంప్లీట్ చేశారన్నమాట.

కల్కి 1 ఎలాగు సూపర్ హిట్ అయ్యింది కాబట్టి కల్కి 2 దానికి మించి ఉందేలా ప్లాన్ చేస్తున్నారు. కల్కి 2 సినిమాను కుదిరితే 2025 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. 2025 సమ్మర్ అంటే కరెక్ట్ గా చూస్తే మరో ఏడాది లోపే అన్నమాట. మరి చాలా పెద్ద సినిమాలు కూడా మొదటి పార్ట్ రిలీజైన ఇంత తక్కువ టైం లో రెండో భాగం వదల్లేదు.

ఐతే నాగ్ అశ్విన్ కల్కి సినిమాను మణిరత్నం తరహాలో రెండో భాగానికి సంబందించిన షూటింగ్ కూడా కొంత పూర్తి చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి కల్కి తో ప్రభాస్ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. కచ్చితంగా కల్కి 2 కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. మరి కల్కి 2 నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి నిజంగా వస్తుందా లేదా అన్నది చూడాలి.

Also Read : Venkatesh : వెంకీ మామ కోసం ఆ దర్శకుడి నిరీక్షణ ఎన్నాళ్లు..?