Kalki 1 Only 40 Percent Finished Nag Aswin Shocking Comments : కల్కి 1 ఫార్టీ పర్సెంట్ మాత్రమేనా.. నాగ్ అశ్విన్ ఇలా షాక్ ఇచ్చాడేంటి..?

కల్కి 1 సినిమా కథ కేవలం 40 శాతమే అని సెకండ్ పార్ట్ లో మిగతా 60 శాతం ఉంటుందని అన్నారు

Published By: HashtagU Telugu Desk
Kalki Director Nag Aswin Liked two Scenes in his movie

Kalki Director Nag Aswin Liked two Scenes in his movie

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898AD (Kalki 2898AD) సినిమా మొదటి పార్ట్ తోనే ఎన్నో సంచలనాలు సృష్టిస్తుంది. కల్కి 1 గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో మీడియా మీట్ లో పాల్గొన్నాడు నాగ్ అశ్విన్. అతను చేసిన ఈ అటెంప్ట్ ని ప్రేక్షకులు ఇంత బాగా యాక్సెప్ట్ చేసినందుకు కృతజ్ఞతలు తెపిపాడు. అంతేకాదు సై ఫై సినిమాలు ఫ్యూచర్ లో ఎవరైనా చేయాలని అనుకుంటే వారికి కల్కి ఒక స్పూర్తిగా నిలుస్తుందని అన్నారు.

ఐతే కల్కి సినిమాను ఒక ప్రాజెక్ట్ గా చేయాలని అనుకోగా ఈ పాత్రల చాలా బలంగా మారడంతో సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేశామని అన్నారు. 20 రోజులు షూట్ తర్వాత సినిమాపై ఒక క్లారిటీ వచ్చిందని అన్నారు. అంతేకాదు కల్కి 2 లో చాలా సర్ ప్రైజ్ లు ఉంటాయని చెప్పుకొచ్చారు. కల్కి 1 సినిమా కథ కేవలం 40 శాతమే అని సెకండ్ పార్ట్ లో మిగతా 60 శాతం ఉంటుందని అన్నారు Nag Aswin.

సెకండ్ పార్ట్ లో ప్రభాస్ (Prabhas) ఫుల్ లెంగ్త్ రోల్ ఉంటుందని అన్నారు. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ (Kamal Hassan), దీపికా ఈ నలుగురు పాత్రల వల్ల సినిమా ఈ స్థాయిలో నిలిచిందని అన్నారు. వైజయంతి లాంటి బ్యానర్ ఉంటే ఇలాంటి గొప్ప సినిమాలు తీసే అవకాశం ఉంటుందని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో ఇంకా చాలా ప్రాజెక్ట్ లు వస్తాయని దాని గురించి ఇప్పుడు ఏమీ ఆలోచించలేదని అన్నారు నాగ్ అశ్విన్.

  Last Updated: 05 Jul 2024, 10:45 PM IST