Site icon HashtagU Telugu

Vishwanath Passed Away: బ్రేకింగ్.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత

Vishwanath Passed Away

Viswanadj

టాలీవుడ్ లో వరస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్, కళాతపస్వి కే.విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా ఆయన 50పైగా సినిమాలను డైరెక్ట్ చేశారు. కళాతపస్వి కే.విశ్వనాథ్ అనేక సినిమాలలో కీలక పాత్రలలో కూడా నటించారు. చరిత్రలో మమాన్నతంగా నిలిచిపోయిన ఈ కళాతపస్వి.. కాళీనాధుని విశ్వనాథ్ 1930న విజయవాడలో జన్మించారు. తండ్రి పేరు సుబ్రమణ్యం.

ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్ కార్యాలయంలో మేనేజర్ గా వర్క్ చేస్తుండేవారు. తండ్రి చేసే ఉద్యోగంతో ఏమాత్రం సంబంధం లేనట్టుగా కనిపించే విశ్వనాథ్ 1948లో సైన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అయితే.. విశ్వనాథ్ లోని లోపలి మనిషి అతను మద్రాసు వెళ్లే వరకు ఎవరికీ తెలియదు. మద్రాసు వెళ్లి వాహినీ స్డూడియోలో చేరారు. అక్కడే సినిమా రంగం నుంచి పూర్తి స్ధాయిలో తెలుసుకున్నారు. రికార్డింగ్, రీ రికార్డింగ్, సౌండ్, కెమెరా.. ఇలా సినిమా రంగంలోని అన్నింటికి గురించి తెలుసుకున్నాకే తనేంటో నిరూపించుకున్నారు. 1966లో అక్కినేని హీరోగా అన్న‌పూర్ణ సంస్థ నిర్మించిన ‘ఆత్మ‌గౌర‌వం’తో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అయ్యారు విశ్వ‌నాథ్‌.