Site icon HashtagU Telugu

Maharagni Glimpse : 27 ఏళ్ళ తర్వాత కాజల్, ప్రభుదేవా సినిమా.. మహారాగ్ని గ్లింప్స్ రిలీజ్.. బాలీవుడ్‌లో తెలుగు డైరెక్టర్..

Maha Ragni

Maha Ragni

Maharagni Glimpse : బాలీవుడ్ హీరోయిన్ కాజోల్(Kajol), ప్రభుదేవా(Prabhudeva) కలిసి 27 ఏళ్ళ క్రితం మెరుపుకలలు అనే సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పించారు. ఆ సినిమా తెలుగు, తమిళ్, హిందీలో భారీ విజయం సాధించింది. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ జంట కలిసి నటిస్తుంది. టాలీవుడ్ నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా మహారాగ్ని. భారీ బడ్జెట్ తో యాక్షన్ థ్రిల్లర్‌ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. కాజోల్, ప్రభుదేవాతో పాటు నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్.. పలువురు ముఖ్య పత్రాలు పోషిస్తున్నారు.

తాజాగా మహారాగ్ని సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు. గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా అసాగింది. ప్రభుదేవా స్వాగ్, యాక్షన్ సీక్వెన్సెలు, సంయుక్త మీనన్ ఇంటెన్స్ క్యారెక్టర్, ఇక కాజోల్ యాక్షన్ సీన్స్, డైలాగ్స్ అదిరిపోయాయి. ప్రస్తుతం టీజర్ ని హిందీలోనే రిలీజ్ చేసారు. ఈ టీజర్ ట్రెండింగ్ లో ఉంది.

షారుఖ్ జవాన్ సినిమాకు పనిచేసిన జీకే విష్ణు ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తుండగా ఎడిటర్ గా నవీన్ నూలి వర్క్ చేస్తున్నారు.