Baazigar 30 Years : షారుఖ్ ఖాన్ సూపర్‌హిట్ మూవీ ‘బాజీగర్’ గురించి తెలియని వారు ఎవరు ఉంటారు ! ఆ సినిమా రిలీజై నేటికి సరిగ్గా 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1992 సంవత్సరంలో నవంబరు 12న బాజీగర్ రిలీజై సంచలనం క్రియేట్ చేసింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ మధుర క్షణాలను కాజోల్ ఆదివారం రోజు గుర్తు చేసుకున్నారు. తన కెరీర్‌లో ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన బాజీగర్ మూవీ 30వ వార్షికోత్సవం గురించి ఆమె ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఆ మూవీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు ఆ సినిమా అందించిన గుర్తింపు గురించి కాజోల్ వివరించారు. బాజీగర్ మూవీని మరువలేనని పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా కాజోల్ చేసిన ఈ పోస్టులో షారుఖ్ ఖాన్, శిల్పాశెట్టిలతో కలిసి తాను దిగిన ఫొటోలను షేర్ చేశారు. ఆ ఫొటోలు మధుర జ్ఞాపకాలను మిగిల్చాయని చెప్పుకొచ్చారు. ‘బాజీగర్ మూవీలోని ప్రతి పాట, ప్రతి డైలాగ్ నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆ సిినిమా షూటింగ్‌ను మా మూవీ యూనిట్ చాలా ఎంజాయ్ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
#Baazigar completes 30 years.. This set was a whole lot of firsts .. The first time I worked with Saroj Ji, the first time I met @iamsrk . The first time I met @The_AnuMalik … and me all of 17 when I started the film .. Abbas bhai and Mustan bhai actually treated me with all the… pic.twitter.com/OR5YWfbzlW
— Kajol (@itsKajolD) November 12, 2023
బాజీగర్ మూవీ ఆసక్తికర అంశాలు..
- బాజీగర్ మూవీ షారుఖ్ ఖాన్ సినీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ లాంటిది.
- 1992లో ప్రముఖ హిందీ సినీ నిర్మాతలు అబ్బాస్-మస్తాన్‌లు కలిసి ‘బాజీగర్’ మూవీని నిర్మించారు. ఇందులో షారుఖ్ ఖాన్, కాజోల్, శిల్పాశెట్టి, రాఖీ గుల్జార్, జానీ లీవర్, దిలీప్ తాహిల్ వంటి నటీనటులు నటించారు.
- బాజీగర్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. షారూఖ్ ఖాన్ మొదటి సూపర్ హిట్ మూవీ ఇది.
- వాస్తవానికి షారుఖ్ కంటే ముందు.. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు ‘బాజీగర్’లో హీరోగా నటించే ఆఫర్ వచ్చింది. ఈవిషయాన్ని కపిల్ శర్మ షోలో సల్మాన్ స్వయంగా వెల్లడించారు.
- బాజీగర్ కంటే ముందు ‘మైనే ప్యార్ కియా’ మూవీతో సల్మాన్ ఖాన్ రొమాంటిక్ హీరోగా తనదైన ముద్ర వేశారు. అటువంటి పరిస్థితిలో బాజీగర్‌లో యాంటీ హీరో పాత్రలో నటించలేనని సల్మాన్ స్పష్టం చేశారు. దీంతో ఆ ఛాన్స్ షారుఖ్ ఖాన్‌కు దక్కింది.
- శిల్పాశెట్టి ‘బాజీగర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.
- ‘రోజా’ సినిమాతో తనదైన ముద్ర వేసిన నటి మధుకి బాజీగర్‌లో ‘సీమ’ పాత్రలో యాక్ట్ చేసే ఆఫర్ ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల సీమ పాత్రను చేయలేనని మధు చెప్పారు. దీంతో సీమ పాత్ర శిల్పాశెట్టికి(Baazigar 30 Years) దక్కింది.