టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాజల్ ఆరోగ్యం బాగానే ఉంది. అయితే ఈ జంట తమ మగ బిడ్డకు ‘నీల్ కిచ్లు’ అని పేరు పెట్టారు. ఏప్రిల్ 19 ఉదయం జన్మించిన నీల్ ఈ దంపతులకు మొదటి సంతానం. నీల్ అంటే ఛాంపియన్ అని అర్థం. “నీల్ కిచ్లూ పుట్టినట్లు ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఏప్రిల్ 19, 2022. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల ప్రేమ, ఆశీర్వాదానికి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.” అంటూ కాజల్ భర్త సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. కాజల్ 2020 అక్టోబర్‌లో గౌతమ్‌ని పెళ్లి చేసుకుంది.
It's a baby boy for #KajalAggarwal and #GautamKitchlu @MsKajalAggarwal #Entertainment #Bollywood https://t.co/B7AvsxUYBv
— Mid Day (@mid_day) April 19, 2022