Kajal Aggarwal: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్!

కాజల్, ఆమె భర్త గౌతమ్ కిచ్లు ఇప్పుడు తల్లిదండ్రులు అయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Kajal

Kajal

కాజల్, ఆమె కుటుంబ సభ్యులకు ఇది వేడుక సమయం. కాజల్, ఆమె భర్త గౌతమ్ కిచ్లు ఇప్పుడు తల్లిదండ్రులు అయ్యారు. ఈ జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. మంగళవారం కాజల్ మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, నవజాత శిశువు క్షేమంగా ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో కాజల్ తాను గర్భం దాల్చినట్లు ప్రకటించింది. గత ఏడాది, ఆమె గర్భం దాల్చినట్లు నిర్ధారణ కావడంతో నాగార్జున ‘ది ఘోస్ట్’ నుంచి తప్పుకుంది. కాజల్, గౌతమ్ 2020 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు. తాజాగా కాజల్ తన భర్తకు రాసిన ప్రేమ లేఖను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. “బిడ్డను ప్రేమించే తండ్రిని కలిగి ఉండటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. అతనో రోల్ మోడల్‌. మాతృత్వం అనేది అద్బుతమైనది. ఒక మూమెంట్‌లో అంతా మన చేతిలో ఉందని అనుకొంటాం. కానీ మరో క్షణం గడిస్తే.. మన చేతిలో ఏమీ లేదనే విషయం స్పష్టమవుతుంది.” అంటూ స్పందించింది.

  Last Updated: 19 Apr 2022, 09:43 PM IST