Site icon HashtagU Telugu

Kajal Aggarwal: బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాజల్ అగర్వాల్.. నీతి విలువలు లేవంటూ?

Kajal Aggarwal

Kajal Aggarwal

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది కాజల్. చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కాగా కాజల్ మొదట లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు రావడంతో అతి తక్కువ సమయంలోనే ఊహించని విధంగా స్టార్ హీరోయిన్ రేంజ్ కి దిగింది.

ఇది ఇలా ఉంటే కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ని పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ దంపతులకు పండంటి మగబిడ్డ కూడా ఉన్నాడు. కాగా కాజల్ మొన్నటి వరకు కొడుకు బాధ్యతలు చూసుకుంటూ ఇంటికే పరిమితం అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా కాజల్ అగర్వాల్ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే.. రైజింగ్ ఇండియా సమిట్ 2023లో పాల్గొన్న సందర్భంగా కాజల్ మాట్లాడుతూ..

నేను పుట్టింది పెరిగింది ముంబైలో అయినా కెరియర్ ని మొదలు పెట్టింది మాత్రం హైదరాబాదులోనే.. సౌత్ సినిమాలతోనే నేను స్టార్ హీరోయిన్గా ఎదిగాను.. తెలుగు తమిళంలో సినిమాలు చేయడం వల్ల హైదరాబాద్, చెన్నై లతో నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. సౌత్ సినిమాలలో స్నేహపూర్వకమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది. సౌత్ ప్రేక్షకులు కూడా టాలెంట్ ఉంటే ఎవరినైనా ఆదరిస్తారు. తెలుగులో హీరోయిన్ పాత్రలకు ఎక్కువగా గుర్తింపు లభిస్తుంది. కానీ బాలీవుడ్లో అలా కాదు. కొన్ని మంచి సినిమాలో నటించినా.. సౌత్ ఉన్నట్లు నీతి నైతిక విలువలు బాలీవుడ్లో లోపించాయి. బాలీవుడ్ సినిమాలు అంటే కూడా నాకు గౌరవమే అని చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్.

Exit mobile version