Kajal Aggarwal: హీరోయిన్ కాజల్ ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ చందమామ అనే ట్యాగ్ ను సొంతం చేసుకుంది. అయితే చాలామంది హీరోయిన్స్ పెళ్లయ్యాక కెరీర్ కు గుడ్ బై చెబుతారు. కానీ కాజల్ మాత్రం తగ్గేదేలే అంటూ అటు ఫ్యామిలీ, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తోంది. సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్ తాజాగా నటించిన చిత్రం ‘సత్యభామ’. ఈ సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కాజల్ తల్లిదండ్రులు ఆమె చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
చిన్నతనంలో ఆ పాట పాడినప్పుడే.. పెద్దయ్యాక అమె గొప్ప నటి అవుతుందని తాను అనుకున్నట్టు కాజల్ తండ్రి వినయ్ అగర్వాల్ చెప్పారు. స్కూల్‌కు వెళ్లకుండా ఉండేందుకు కాజల్ చేసిన యాక్టింగ్‌ను చూసి నిజమే అనుకున్నానని తల్లి సుమన్ అగర్వాల్ చెప్పారు. తమ కుమార్తె ఇంత గొప్ప స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎన్నాళ్ల నుంచో కాజల్‌ను యాక్షన్ పాత్రలో చూడాలని అనుకుంటున్నామని.. ఆ కోరిక ‘సత్యభామ’తో తీరుతోందని వివరించారు.