Site icon HashtagU Telugu

Kajal Aggarwal: నా ఫేవరేట్ హీరో అతనే.. కాజల్ కామెంట్స్ వైరల్?

Mixcollage 19 Mar 2024 10 14 Pm 2067

Mixcollage 19 Mar 2024 10 14 Pm 2067

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాజల్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కాజల్.
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ మూవీ 2007లో విడుదల అయ్యి ఈ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ కాజల్ నటనకు గాను మంచి మార్కులు పడ్డాయి.

ఆ తర్వాత 2009లో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంలో హీరోయిన్ గా నటించింది. తర్వాత కాజల్ కు టాలీవుడ్ లో మంచి బ్రేక్ వచ్చి పడింది. దాంతో ఈ చిన్నదాని క్రేజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది కాజల్. పెళ్లి అయిన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది.

కాగా దాదాపు తెలుగులో టాప్ స్టార్స్ సరసన నటించిన కాజల్ తాజాగా తన ఫేవరెట్ హీరో ఎవరు అన్న విషయాన్ని తాజాగా తెలియజేసింది. ఆయనెవరో కాదు యంగ్ టైగర్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్. ఆయనతో నటించడమంటే చాలా ఇష్టమట. ఇక తమిళంలో విజయ్ దళపతి తన ఫేవరెట్ హీరో అని నిర్మోహమాటంగా తెలియజేసింది. ప్రస్తుతం కాజల్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు తన భర్త కొడుకుతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. అప్పుడప్పుడు పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తోంది..