Report: కాజల్ ప్రెగ్నెన్సీ.. ఇండియన్-2కు మళ్లీ అడ్డంకులు!

టాలీవుడ్ చందమామకు ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్ అయినట్టేనా? పిల్లల కోసమే కాజల్ కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదా? ఇండియన్ 2 మూవీ ప్రొడ్యూసర్ కాజల్ ను రిప్లేస్ చేయనున్నారా? ప్రస్తుతం లాంటి విషయాలన్నీ చర్చనీయాంశంగా మారాయి.

  • Written By:
  • Updated On - November 10, 2021 / 11:42 AM IST

కమల్ హసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు ఎంతో పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు కొనసాగింపుగా మరో సినిమాను తీస్తే బాగుంటుందని సినీ ప్రేక్షకులు కూడా ఆశించారు. అందరీ అంచనాలను నిజం చేస్తూ శంకర్, కమల్ హాసన్ కలయికలో ఇండియన్-2 సినిమా ప్రకటన వెలువడింది. అయితే ఏ ముహుర్తాన సినిమాను ప్రారంభించారో కానీ.. ఆది నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి.

తాజాగా కాజల్ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో ఆమె గర్భవతి కావడంతో ఆమె స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఈ మూవీలో వృద్ధ పాత్రను పోషిస్తున్నట్లు ఇప్పటికే తెలిసింది. హెవీ మెకప్ కోసం కాజల్ కూడా రెడీ అయ్యింది. అయితే కాజల్ ప్రెగ్నెంట్ అని తెలియడంతో మరో హీరోయిన్ రీప్లేస్ చేసే పనిలో పడ్డారు ప్రొడ్యూసర్స్.

గతేడాది తన చిరకాల ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్ తన మొదటి బిడ్డను ఆశిస్తున్నట్లు కొన్ని సందర్భాల్లో చెప్పింది. కానీ ప్రెగ్నెన్సీ కాజల్ సైలంట్ గా ఉంది. సమయం వచ్చినప్పుడే నేనే చెప్తా అంటూ విషయాన్ని దాటవేస్తోంది. అయితే ఇండియన్ 2, మొదటి నుండి చాలా అడ్డంకులు ఎదుర్కొంటోంది. సెట్స్ లో ఘోర ప్రమాదాలు జరగడం, కరోనా కారణంగా వాయిదాలు పడటం, కమల్ పొలిటికల్ ఎంట్రీ వల్ల కూడా సినిమా షూటింగ్ కొన్ని రోజులు నిలిచిపోవడం లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే త్వరలోనే అన్ని సమస్యలను అధిగమించేందుకు చిత్ర నిర్మాతలు రెడీ అవుతున్నారు. అన్ని కుదిరితే డిసెంబర్ లో ఈ సినిమాను ప్రారంభించే అవకాశాలున్నాయి. శంకర్ దర్శకత్వం ఈ మూవీ పొలిటికల్ థ్రిల్లర్ అని ఇప్పటికే స్పష్టమైంది. కాగా ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, వివేక్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ పురోగతికి సంబంధించి రాబోయే రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.