Kannappa : కన్నప్ప మూవీలోకి మరో స్టార్ ఎంట్రీ.. ఈసారి అందాల భామ..

కన్నప్ప మూవీలోకి మరో స్టార్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈసారి అందాల భామ..

Published By: HashtagU Telugu Desk
Kajal Aggarwal Plays A Important Role In Manchu Vishnu Kannappa

Kajal Aggarwal Plays A Important Role In Manchu Vishnu Kannappa

Kannappa : టాలీవుడ్ లో ఒక కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయిన ‘భక్త కన్నప్ప’ కథని.. కొత్త టెక్నాలజీతో సరికొత్తగా ఇప్పటి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు మంచు కుటుంబం పని చేస్తుంది. మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు కన్నప్పగా.. ఇప్పటి ‘కన్నప్ప’ తెరకెక్కుతుంది. అప్పటి కన్నప్పలో హీరోగా కనిపించిన కృష్ణంరాజు వారసుడు ప్రభాస్.. ఈ కన్నప్పలో ఓ ముఖ్య పాత్రని చేస్తున్నారు. అలాగే ఈ మూవీలో మరికొంతమంది స్టార్స్ కూడా కనిపించబోతున్నారు.

బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రీతి ముఖుంధన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, నయనతార, మధుబాల, బ్రహ్మానందం వంటి స్టార్ కాస్ట్ కనిపించబోతుంది. తాజాగా ఈ స్టార్ లిస్టులోకి మరో బ్యూటిఫుల్ స్టార్ వచ్చి చేరింది. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో ఓ ముఖ్య చేసేందుకు ఓకే చెప్పారట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ నేడు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.

కాగా వచ్చే వారం ఈ సినిమా నుంచి టీజర్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మే 20న ఈ మూవీ టీజర్ ని ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ప్రపంచ సినిమా పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కన్నప్ప టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. మరి ఈ టీజర్ లో ఏఏ స్టార్ ని పరిచయం చేస్తారో చూడాలి. ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్ కాబట్టి.. మూవీ రీచ్ కోసం ప్రభాస్ ని టీజర్ లో చూపించే అవకాశం ఉంటుందని టాక్ వినిపిస్తుంది. మరి మంచు విష్ణు టీజర్ ఎలా కట్ చేయిస్తున్నారో చూడాలి.

 

 

  Last Updated: 17 May 2024, 05:00 PM IST