Site icon HashtagU Telugu

Indian 2 : ఇండియన్ 2లో కాజల్ అగర్వాల్ లేదంట.. మరి మార్షల్ కూడా నేర్చుకుంది..!

Kajal Aggarwal Didnt Appear In Kamal Haasan Indian 2 Movie

Kajal Aggarwal Didnt Appear In Kamal Haasan Indian 2 Movie

Indian 2 : 28ఏళ్ళ క్రిందట వచ్చిన సూపర్ హిట్టు మూవీ ‘భారతీయుడు’కి.. ఇప్పుడు సీక్వెల్ ని తీసుకు వస్తున్నారు దర్శకుడు శంకర్ అండ్ కమల్ హాసన్. ఇక ఈ సీక్వెల్ ని రెండు పార్టులుగా తీసుకు రాబోతున్నారు. ఇండియన్ 2 అండ్ ఇండియన్ 3గా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన షూటింగ్ ని కూడా శంకర్ పూర్తి చేసేసారు. ఈ సినిమాలో సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, ఎస్ జె సూర్య, బాబీ సింహ, సముద్రఖని.. వంటి స్టార్ కాస్ట్ నటించింది.

వీరంతా షూటింగ్ లో పాల్గొని తమ తమ పాత్రల చిత్రీకరణ కూడా పూర్తి చేసారు. మరి కాజల్ అగర్వాల్ ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని షూటింగ్ లో పాల్గొంది. కానీ ఇండియన్ 2 సినిమాలో మాత్రం కాజల్ అగర్వాల్ కనిపించదట. అవును నిజమే ఇండియన్ 2లో కాజల్ పాత్ర లేదంట. ఆమె పాత్ర ఇండియన్ 3లో వస్తుందట. ఈ విషయం కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ ని కొంత నిరాశ పరుస్తుంది.

ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో కమల్ హాసన్ స్క్రీన్ ప్రెజెన్స్ కంటే సిద్దార్థ్‌ది ఎక్కువ ఉంటుందట. మూవీలో కమల్ హాసన్ మెయిన్ లీడ్ అయ్యినప్పటికీ సిద్ధార్థే ఎక్కువ కనిపించనున్నారట. ‘విక్రమ్’ సినిమాలో ఫహద్ ఫాజిల్ ఎలా కథని ముందుండి నడిపిస్తాడో.. ఇండియన్ 2లో సిద్దార్థ్ కూడా అలానే కథని ముందుకు తీసుకు వెళ్లనున్నారట. కాగా ఈ మూవీని జులైలో రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేసారు. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.