Kajal Aggarwal : బాలయ్య కోసం మొదటిసారి తెలుగులో మాట్లాడిన కాజల్.. అదరగొట్టేసిందిగా..

బాలయ్య కోసం మొదటిసారి తెలుగులో మాట్లాడిన కాజల్ అగర్వాల్. బాల సార్ దగ్గర లెక్కలు ఉండవు. కేవలం ఎమోషన్స్ మాత్రమే ఉంటాయంటూ..

  • Written By:
  • Publish Date - May 25, 2024 / 09:23 AM IST

Kajal Aggarwal : ‘లక్ష్మి కళ్యాణం’ సినిమాతో కెరీర్ ని స్టార్ట్ చేసిన కాజల్ అగర్వాల్.. రెండో సినిమా ‘చందమామ’తో టాలీవుడ్ చందమామగా గుర్తింపుని సంపాదించుకున్నారు. ఆ తరువాత ‘మగధీర’తో ఇండస్ట్రీ హిట్టుని అందుకొని నెంబర్ వన్ హీరోయిన్ పొజిషన్ ని అందుకున్నారు. ఈ పదిహేడేళ్ల ప్రయాణంలో సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ఆల్మోస్ట్ టాలీవుడ్ లోని సగం పైన స్టార్స్ తో కలిసి నటించేసారు. కానీ ఈ ప్రయాణంలో తెలుగు మాత్రం నేర్చుకోలేదు.

కాజల్ తరువాత వచ్చిన చాలామంది హీరోయిన్స్.. తెలుగు నేర్చుకొని మాట్లాడుతూ ఆకట్టుకుంటున్నారు. కానీ కాజల్ మాత్రం పదిహేడేళ్లు అవుతున్నా ఇంకా తెలుగు నేర్చుకోలేదు. మూవీ ఈవెంట్స్ లో కొంచెం కొంచెం తెలుగు మాట్లాడానికి కూడా కాజల్ ప్రయత్నించరు. ఇప్పటికి ఇంగ్లీష్ లోనే మాట్లాడుతూ వస్తుంటారు. ఈ విషయంలో కాజల్ ని పలువురు విమర్శిస్తుంటారు. అయితే తాజాగా కాజల్ మొదటిసారి తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించరు.

అదికూడా బాలకృష్ణ కోసం. కాజల్ మెయిన్ లీడ్ తెరకెక్కిన ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ ‘సత్యభామ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. నిన్న బాలకృష్ణ ముఖ్య అతిథిగా గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో కాజల్ మాట్లాడుతూ.. మొదటిసారి తెలుగులో మాట్లాడుతున్నా, కొంచెం అర్ధం చేసుకోండి అంటూ బాలయ్య గురించి చెప్పుకొచ్చారు.

“బాల సార్ దగ్గర లెక్కలు ఉండవు. కేవలం ఎమోషన్స్ మాత్రమే ఉంటాయి. ఆయన లాంటి మంచి మనసు గల వ్యక్తిని నేను ఇప్పటి వరకు చూడలేదు. బాల సార్ డిక్షన్ కి నేను చాలా పెద్ద అభిమానిని. ఆయన ఎనర్జీ ఎవరితో పోలచలేనిది, ప్రేమ స్వచ్ఛమైనది, ఆయన మొత్తానికి అన్‌స్టాపబుల్” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.