Kajal 60th Movie : కాజల్ 60వ సినిమా గ్లింప్స్ రిలీజ్.. లేడీ ఓరియెంటెడ్‌గా అదరగొట్టేసిందిగా..

తాజాగా కాజల్ 60వ సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో కాజల్ అదరగొట్టేసింది. గ్లింప్స్‌లో కాజల్ కి మాత్రం అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Kajal Aggarwal 60th Movie satyabhama title and glimpse released

Kajal Aggarwal 60th Movie satyabhama title and glimpse released

ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాజల్(Kajal Aggarwal)తెలుగు, తమిళ్, హిందీలో సినిమాలు చేసి ఎంతోమంది అభిమానులని సంపాదించుకుంది. కరోనా సమయంలో పెళ్లి చేసుకొని ఆ తరువాత బాబుని కని కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు చేస్తోంది కాజల్.

తాజాగా కాజల్ 60వ సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో కాజల్ అదరగొట్టేసింది. సెల్ లో ఉన్న నేరస్తుల్ని పోలీసులు ఎంత కొట్టినా మాట్లాడకపోవడంతో కాజల్ వచ్చి తన చేత్తో కొట్టి వాళ్ళతో మాట్లాడిస్తుంది. ఈ సీన్ ని చాలా ఎలివేషన్‌తో మాస్‌గా చూపించారు. దీనిబట్టి కాజల్ ఈ సినిమాలో పోలీసాఫీసర్ గా నటిస్తుందని అర్ధమవుతుంది. గ్లింప్స్‌లో కాజల్ కి మాత్రం అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చారు.

ఇక ఈ సినిమా టైటిల్ ని ‘సత్యభామ’గా ప్రకటించారు. ఈ సినిమాని అఖిల్ డేగల తెరకెక్కిస్తుండగా, దర్శకుడు శశికిరణ్ తిక్క నిర్మిస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ప్రస్తుతం ఈ సత్యభామ సినిమా షూట్ దశలో ఉంది. ఇక కాజల్ చాలా గ్యాప్ తర్వాత ఇలా కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

Adipurush : వెనక్కు తగ్గిన ఆదిపురుష్ చిత్రయూనిట్.. డైలాగ్స్ మారుస్తాం అంటూ ప్రకటన..

  Last Updated: 18 Jun 2023, 07:10 PM IST